Kidneys : కిడ్నీలు అసలు ఏం పని చేస్తాయి.. కిడ్నీలు బాగుంటే మన ఆరోగ్యం బాగున్నట్టే..

ఈ మధ్యకాలంలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ(Kidneys)లో రాళ్ళు వస్తున్నాయి. దాని వలన కిడ్నీల పనితీరు తగ్గుతుంది. ఇంకా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు.

  • Written By:
  • Publish Date - June 23, 2023 / 10:00 PM IST

ఈ మధ్యకాలంలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ(Kidneys)లో రాళ్ళు వస్తున్నాయి. దాని వలన కిడ్నీల పనితీరు తగ్గుతుంది. ఇంకా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు. అసలు కిడ్నీలు మన శరీరంలో ఏమి పనిచేస్తాయో తెలుసా?

#కిడ్నీలు రోజులో మన శరీరంలోని రక్తాన్ని గంటకు రెండు సార్లు ఐదు లీటర్ల చొప్పున శుద్ధి చేస్తుంది. అంటే రోజుకు 48 సార్లు ఐదు లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి.

#రక్తంలో ఆమ్లతత్వం పెరగకుండా చేస్తుంది.

#కిడ్నీలు మన శరీరంలో ఎక్కువగా ఉండే నీటిని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఈ మూత్రంతో పాటు మన శరీరంలోని వ్యర్ధాలను, ట్యాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.

#ఇంకా మన శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే మనం డీహైడ్రాషన్ కు గురికాకుండా మన శరీరంలోని నీరు బయటకు పోకుండా కిడ్నీలు ఆపుతాయి.

#రక్తపోటును అదుపులో ఉంచే హార్మోన్లను కిడ్నీలు విడుదల చేస్తాయి.

#మూత్రపిండాలు మన శరీరానికి విటమిన్ డి అందేలా చేస్తుంది.

#కిడ్నీలు మన శరీరంలోని రక్తంలో మినరల్ స్థాయిలు, చక్కర స్థాయిలు అదుపులో ఉండేలా చేస్తాయి.

#మూత్రపిండాలు మన శరీరంలో మనం వాడే మందుల వలన వచ్చే విషపదార్థాలు, రసాయనాలను బయటకు పంపిస్తాయి.

కిడ్నీలు దెబ్బతిన్న వారికి వారి శరీరంలో రసాయనాలు, విషపదార్థాలు పేరుకుపోయి రక్తం విషపూరితం అవుతుంది. కిడ్నీలు దెబ్బతిన్న వారికి రక్తపోటు అదుపులో ఉండదు. ఇంకా రక్తహీనత సమస్య కూడా వస్తుంది. డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వారు తినే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి. నిల్వ పచ్చళ్ళను తినకూడదు. ఈ విధంగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది.