డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు. డయాబెటిస్ ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.. కొన్ని కొన్ని సార్లు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవడం కోసం మార్కెట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి కూడా షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే వాటిలో జాపత్రి కూడా ఒకటి. ఎక్కువగా మసాలా ఐటెమ్స్, బిర్యానీ వంటి వాటిలో ఈ జాపత్రిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.
జాపత్రి ఆహారానికి రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.. ఈ జాపత్రిని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడం కోసం ఉపయోగించవచ్చు.. జాపత్రిలో విటమిన్స్ ఎ, సి, బి1, బి2 లు ఉన్నాయి. దీంతో పాటు మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్ లు ఉన్నాయి. జాపత్రి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ని తగ్గిస్తాయి. షుగర్ ఉన్న వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలుకలపై జరిగిన అధ్యయనాల్లో జాపత్రిలోని సారం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేశాయని తేలిందని తెలిపారు. జాజికాయ కూడా ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటివారు ఈ జాజికాయని ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
జాజికాయలోని అనేక పదార్థాలు షుగర్ ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కాబట్టి, ఇతర ఆరోగ్య సమస్యలు, సీజనల్ సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే జాజికాయని డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. జాజికాయను మనం వంట్లో వేసి వాడుకుంటాం. దీంతో పాటు అనేక రకాలుగా తీసుకోవచ్చు. దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా.. నీటిలో మరిగించి టీలా చేసుకుని గోరువెచ్చగా తాగవచ్చు. దీని వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సీజనల్ సమస్యలు కూడా రావు. రాత్రి పడుకునే ముందు జాజికాయ పొడిని కొద్దిగా పాలు, నీటిలో కలిపి తాగవచ్చు. దీని వల్ల నిద్రలేమి సమస్యలకి కూడా చెక్ పెట్టవచ్చు..దీంతో పాటు బరువు తగ్గడం, జీర్ణ సమస్యలు దూరమవుతాయట. దీని వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి.చాలా మంది దీనిని డోనట్స్, కేక్స్, పుడ్డింగ్స్, కస్టర్డ్, స్వీట్ పొటాటోస్ పై కూడా చల్లి తింటారు..ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ జాజికాయలో మిరిస్టిసిన్ ఉంటుంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎక్కువగా తీసుకున్నప్పుడు వికారం, మైకం వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోవద్దు. మిగతావారు తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.