Cancer: ఈ సంకేతాలతో క్యాన్సర్ వ్యాధిని ఇలా ముందుగానే గుర్తించండిలా!

క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరణమే శరణ్యం అని చెప్పవచ్చు. అయితే ఈ

  • Written By:
  • Publish Date - September 9, 2022 / 08:30 AM IST

క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరణమే శరణ్యం అని చెప్పవచ్చు. అయితే ఈ క్యాన్సర్ లో కూడా అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నోటి కేన్సర్, ఉదర క్యాన్సర్, బ్రెస్ట్ కేన్సర్, బ్లడ్ కేన్సర్ ఇలానే రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేయకుండా ఆలస్యం చేస్తే ఆ వ్యాధి మరింత తీవ్రమై ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా క్యాన్సర్ ని ఎట్టి పరిస్థితులలోనూ నెగ్లెట్ చేయకూడదు. అయితే మరి ఈ క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం ఎలా?

క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్పవచ్చు. మరి క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ దగ్గు కాకుండా రోజురోజుకి దగ్గు ఎక్కువ అవుతుండడం ఈ క్యాన్సర్ కి సంకేతంగా చెప్పుకోవచ్చు. అలాగే జ్వరం 3 లేదా నాలుగు వారాలపాటు ఉండడం. డాక్టర్ ని సంప్రదించినప్పటికీ జ్వరం అలాగే వస్తుంటే దానిని క్యాన్సర్ సంకేతంగానే భావించవచ్చు. అలాగే కఫం తుప్పు రంగులో బయటపడటం కూడా క్యాన్సర్ కు సంకేతం అని చెప్పవచ్చు.

అలాగే ఉన్నట్టుండి గొంతు మారడం కూడా ఇందుకు సంకేతం గానే చెప్పుకోవచ్చు. అలాగే మలవిసర్జన మూత్ర విసర్జనలో మార్పులు కూడా క్యాన్సర్ కు సంకేతంగా చెప్పుకోవచ్చు. శరీరంపై నల్లటి మచ్చలు రావడం, పులిపిర్ల చుట్టూ నల్లగా ఏర్పడటం, అలాగే తరచూ వాంతులు విరోచనాలు అవుతుండడం ఇవన్నీ కూడా క్యాన్సర్ కు సంకేతాలుగా భావించవచ్చు. అయితే పైన చెప్పబడిన సంకేతాలలో ఎటువంటి సంకేతాలు మీకు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించి అందుకు సంబంధించిన చికిత్సను తీసుకోవాలి.