Platelet Count: రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి.. ఎటువంటి ఆహారం తీసుకోవాలో మీకు తెలుసా?

మామూలుగా కొందరికి రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య కొన్ని కొన్ని సార్లు తగ్గిపోతూ ఉంటుంది. ప్లేట్ లెట్స్ అంటే రక్త కణాలు అన్న విషయం మనందరికీ తెల

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 06:30 PM IST

మామూలుగా కొందరికి రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య కొన్ని కొన్ని సార్లు తగ్గిపోతూ ఉంటుంది. ప్లేట్ లెట్స్ అంటే రక్త కణాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామందికి అనేక రకాల సమస్యల కారణంగా రక్తంలో ఈ తెల్ల రక్త కణాల సంఖ్య కొన్ని కొన్ని సార్లు పడిపోతూ ఉంటుంది. హైఫీవర్ వచ్చినా, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చాయి అంటే చాలు రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతూ ఉంటాయి. అది కొన్ని కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం. అయితే ఈ రక్త కణాలు తగ్గినప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇతరుల నుంచి రక్త కణాలను ఇప్పించుకోవడం లేదంటే మనం దానం చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు సమయానికి దొరకక ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటప్పుడు ఎలాంటి భయం లేకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు వెంటనే రక్తంలో రక్త కణాలు పెరిగిపోతాయి.

మరి ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయి.. ఎన్నో సుగుణాలు ఉన్న గొప్ప పండు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే బొప్పాయిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి. ప్లేట్ లెట్స్ సంఖ్య తక్కువగా ఉంది అనుకున్న వారు వెంటనే బొప్పాయిని తీసుకుంటే చాలు కౌంట్ పెరుగుతుంది. భవిష్యత్తులో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గకుండా చూసుకోవాలనుకుంటే నిత్యం బొప్పాయిని తీసుకోండి. బొప్పాయి ఆకులను కూడా తినవచ్చు. వాటిని తీసుకున్నా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.

బొప్పాయి ఆకులను ఉడకబెట్టి వాటి రసాన్ని తీసి ఆ తర్వాత ఆకులను తింటే ప్లేట్ లెట్స్ కౌంట్ వద్దన్నా పెరుగుతుంది. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్యని పెంచడంలో దానిమ్మ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. దానిమ్మ పండు గింజలను తింటే రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే ప్లేట్ లెట్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ గింజలను తినడం ఇష్టం లేని వాళ్లు దానిమ్మ జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అలాగే గుమ్మడి కాయలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడికాయను జ్యూస్ లా చేసి కూడా తాగొచ్చు. గుమ్మడికాయను మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి ఆ రసంలో కాసింత తేనె వేసుకొని తాగాలి. అలా చేస్తే. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగినా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచుకోవచ్చు.