మామూలుగా పిట్ గా ఉండడం కోసం రకరకాల డైట్ లు ఫాలో అవ్వడంతో పాటు ఎక్సర్సైజులు చేయడం జిమ్ కి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. మంచి మంచి వర్కౌట్లు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఏమీ లేకుండానే ఒక కిచిడీతోనే ఫిట్ గా ఉండవచ్చు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ కిచిడి ఏమిటి? దానిని ఎలా తయారు చేసుకోవాలి? దాని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. కిచిడీ అనేది కొత్తరకం వంటకం కాదు.
ఎందుకంటే దీనిని ఎప్పటినుంచో చేస్తున్నారు. వెజిటేబుల్ కిచిడి అని, నార్మల్ కిచిడి అని రకరకాల కిచిడీలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. కిచిడీలో ముఖ్యమైన ఇన్ గ్రీడియెంట్ రైస్.
బియ్యంలో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇక రైస్ తో పాటు కిచ్డీలో ఎక్కువగా వాడేది పప్పు దినుసులు. వీటిలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలకు శక్తిని ఇవ్వడంతో పాటు వాటి పెరుగదలకీ తోడ్పడతాయట. అలాగే కిచిడీలో ఆలుగడ్డ, వంకాయతో మరి కొన్ని కూరగాయలు వేసుకుంటారు. వీటన్నింటి లోనూ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తుందట. అందుకే కిచిడీ చాలా త్వరగా జీర్ణమైపోతుందట. అలాగే మలబద్ధకం సమస్యనీ పోగొడుతుందట. కిచిడీని పోపు వేసేటప్పుడు నూనె వాడుతుంటారు. అయితే నూనెకి బదులుగా నెయ్యి వాడితే మరింత పోషకాలు అందుతాయట. నెయ్యి లోని హెల్తీ ఫ్యాట్స్ జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయట.
శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహిస్తాయట. ఇక కిచిడీ లో వేసే యాలకులు, లవంగాలు లాంటి సుగంధ ద్రవ్యాలలో విటమిన్స్ తో పాటు మినరల్స్ ఉంటాయట. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయని, బాడీ మెటబాలిజం సరిగ్గా ఉండేలా చూస్తాయని చెబుతున్నారు. కిచిడీ చాలా సులభంగా జీర్ణమైపోతుందట. వారానికి ఐదు సార్లు తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదట. బియ్యం, పప్పు దినుసులు కలిసి ఉండే వంటకం కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్న వాళ్లు తరచూ దీన్ని తినవచ్చట. కడుపు ఉబ్బరం, అసిడిటీ లాంటి సమస్యలకీ ఇది చెక్ పెడుతుందట. అయితే ఇంత మొత్తంలో రైస్ తింటే బరువు పెరిగిపోతామనే డౌట్ ఉంటుంది. కానీ కిచిడీ వల్ల అలాంటిదేమీ జరగదని చెబుతున్నారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయని అంటున్నారు. కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్ అన్నీ చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటాయి. పైగా ఇందులో కూరగాయలు కూడా యాడ్ చేస్తారు కాబట్టి కేలరీ డెన్సిటీని తగ్గించేస్తాయట. ఇక ఇందులో వేసే పసుపు, జీలకర్ర, అల్లం లాంటి పదార్థాల్లో యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. ఇవి పొట్టలో మంటను తగ్గించి టాక్సిన్లను బయటకు పంపించేస్తాయట. టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడం వల్ల చర్మం ఆరోగ్యకరంగా మారుతుందట. అయితే ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్లు మాత్రం కిచిడీ లో మరి కొన్ని పదార్థాలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందట. కేవలం పప్పు దినుసులే కాకుండా పనీర్, నట్స్ వేసుకోవాలని, పెరుగుతో కలిపి తింటే మరింత ప్రొటీన్ అందుతుందని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వాళ్లు కిచిడీని లైట్ గా తీసుకుంటే మంచిది. లేదంటే రైస్ కి బదులుగా మిలెట్స్ వాడుకోవచ్చు.