మామూలుగా అప్పుడప్పుడు మనకు చెవి నొప్పి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చెవిలో చీము కారడం, చెవి నొప్పి, చెవి పోటు, చెవులు సరిగా వినిపించకపోవడం ఇలా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది డాక్టర్ను సంప్రదిస్తే మరి కొంతమంది సొంత నిర్ణయాలు తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అయితే చెవి నొప్పి సమస్యలకు ఇంటి చిట్కాలలో భాగంగా వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. మరి వెల్లుల్లితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా సందర్భాలలో చెవి నొప్పి జలుబు, రద్దీ అలాగే చెవి నుండి ద్రవాలు కారడం వలన వస్తుంది.
ఇటువంటి సమయాలలో మందులు తీసుకోవడం కంటే నొప్పిని తగ్గించడానికి ఇంటి నివారణ ఉత్తమం. ఇందుకోసం వెల్లుల్లి ఉత్తమమైన ఎంపిక. వెల్లుల్లి బలమైన యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. అలాగే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పని చేస్తుంది. ఇది చెవిలోని ద్రవాల పారుదలను నిరోధిస్తుంది. ముందుగా వెల్లుల్లిని మెత్తని చూర్ణం చేయాలి. ఆ చూర్ణాన్ని కాటన్ బట్టలో చుట్టి చిన్న బాల్ లా తయారు చేయాలి. దీనిని నొప్పి తో బాధపడుతున్న చెవిలో చూపించండి. మరీ లోతుగా కాకుండా చెవి లోపల పెట్టి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. దీనివలన చెవి నొప్పి నెమ్మదిగా ఉపసమిస్తుంది. అలాగే చెవి నొప్పికి వెల్లుల్లి నూనె కూడా బాగా పనిచేస్తుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి వెచ్చని ఆలీవ్ నూనెతో కలపాలి.
ఆ మిశ్రమాన్ని అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆపై దానిని వడకట్టి నొప్పితో ఇబ్బంది పెడుతున్న చెవి రంధ్రంలో కొన్ని చుక్కలు వేయాలి. ఒకప్పుడు పెద్దలు ఈ రెమిడిని ఎక్కువగా వినియోగించేవారు. ఇలా చేస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. నొప్పి అలాగే వాపు నుంచి ఉపశమనం కోసం రోజుకి రెండు మూడు సార్లు ఇలా చేయడం మంచిది. దీనివలన చెవి నొప్పి క్రమేణా తగ్గుతుంది. మరొక పద్ధతిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో మెత్తగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు రెండు నిమిషాలు వేడి చేసి, ఈ సారంలోని కొన్ని చుక్కలను మీ చెవిలో వేయాలి. ఇలా చేయటం వలన కూడా మీ చెవి నొప్పి చాలావరకు తగ్గుతుంది. నొప్పి భరించలేనిదిగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఇంటి పద్ధతులు పాటించకుండా వైద్యుడిని సంప్రదించటం మంచిది.