Breakfast: మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మనం తినే విధానం, మన దినచర్యను నిర్వహించడానికి సాయపడుతుంది. అదేవిధంగా మన ఆరోగ్యం మన చేతుల్లోఎ ఉంటుంది. మన ఆహారపు అలవాట్లే మన శరీరాన్ని మంచిగా లేదా చెడుగా మార్చగలవు. అంటే వ్యాధులకు నిలయంగా ఉంచుతాయి. ఇది అల్పాహారంతోనే మొదలవుతుంది. ఉదయం అల్పాహారం (Breakfast) మీ శరీరం, గుండెపై ప్రభావం చూపుతుంది. ఈ అల్పాహారం సరైన సమయంలో తీసుకోకపోతే అది మీ గుండె చప్పుడును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ విషయం ఇటీవల ప్రచురించిన పరిశోధనలో వెల్లడైంది. దీనిలో టైమ్ కానీ టైమ్‌లో అల్పాహారం తీసుకోవడం మీ హృదయాన్ని ఎలా దెబ్బతీస్తుందో పేర్కొంది. అల్పాహారానికి సరైన సమయం ఏది? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
అల్పాహారానికి సంబంధించిన పరిశోధన
నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కొంతకాలం క్రితం ఒక పరిశోధన చేసింది. ఇందులో ఉదయం అల్పాహారం ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుందని, అయితే అది మీ గుండెపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఉదయం 8 గంటలకు ముందే అల్పాహారం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అదే సమయంలో 9 లేదా 10 గంటల తర్వాత అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుందని తెలుపుతుంది.
Also Read: Anshuman Gaekwad: టీమిండియాలో విషాదం.. మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో కన్నుమూత!
రాత్రి భోజనం- అల్పాహారం మధ్య చాలా గ్యాప్ ఉండాలి
పరిశోధనల ప్రకారం.. కొంతమంది ఉదయం లేవలేరు. వారి జీవనశైలి, తినే సమయాలు భిన్నంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో.. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం సమయాన్ని నిర్ణయించండి. ఈ రెండింటి మధ్య కనీసం 13 గంటల గ్యాప్ ఉండాలి. భోజనం మధ్య ఈ గ్యాప్ కారణంగా సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. మీరు త్వరగా రాత్రి భోజనం చేస్తే మీరు అల్పాహారానికి మంచి గ్యాప్ పొందుతారు. అదే సమయంలో అల్పాహారం రాత్రి భోజనం కంటే తక్కువ గ్యాప్‌లో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అల్పాహారం ఆలస్యం చేయడం వల్ల నిద్ర సమస్యలు
అల్పాహారం ఆలస్యం కావడం వల్ల ఒక వ్యక్తి నిద్రపోయే సమయం కూడా ప్రభావితమవుతుందని పరిశోధన పేర్కొంది. ఇది మొత్తం రోజువారీ దినచర్యను ప్రభావితం చేస్తుంది. స్లీపింగ్ సైకిల్‌ను ప్రభావితం చేయడం వల్ల మీరు రక్తపోటుకు గురవుతారు. ఇది ఎక్కువ లేదా తక్కువగా ఉండటం వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యకరమైన అల్పాహారంతో పాటు దాని సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.