ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో హైబీపీ సమస్య కూడా ఒకటి. చాలామంది అధిక రక్తపోటు కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు హోమ్ రెమెడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే మన వంటింట్లో దొరికి మిరియాల ను ఉపయోగించి కూడా బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే సుగంధద్రవ్యాలలో మిరియాలు కూడా ఒకటి. మిరియాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
నల్ల మిరియాలు రక్త సిరలను విస్తరించడంలో సహాయపడతాయట. ఇది రక్తపోటు అధిక బీపీని నియంత్రణలో ఉంచుతుందట. సాధారణంగా నార్మల్ బి 120/80 ఉంటుంది. అయితే 140/90 ఉంటే కనుక బ్లడ్ ప్రెజర్ క్రమంగా పెరుగుతోందని అర్థం. అలా నియంత్రించలేనప్పుడు సిరలు మూసుకుపోయి, హార్ట్ అటాక్, పక్షవాతం వంటి సమస్యలు రావడం ఖాయం అంటున్నారు. కాగా మిరియాలు శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, థైమోన్ వంటి పోషక మూలకాలు ఇందులో ఉంటాయి.మిరియాలలో ఉండే పైపెరిన్ మూలకం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుందట. అనేక పొట్ట సంబంధిత వ్యాధులను నయం చేస్తుందని చెబుతున్నారు.
నల్ల మిరియాలు, ప్లేట్‌లెట్స్ తో పాటు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందట. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. నల్ల మిరియాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు. రక్తపోటు పెరిగినప్పుడు అర టీ స్పూన్ ఎండు మిరియాల పొడిని గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందట. నల్ల మిరియాలు ఎలా ఉపయోగించాలంటే.. ఉదయం ఖాళీ కడుపుతో నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 నుండి 2 నల్ల మిరియాల పొడిని కలపాలి. నీరు మరి వేడిగా లేకుండా గోరువెచ్చని నీటిని కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ప్రతీ రోజు తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో నల్లమిరయాలు వేడినీళ్లు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందట. మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు అని చెబుతున్నారు.