మామూలుగా స్త్రీలు అందంగా ఉండడం కోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అందం అంటే చాలామంది చేతులు కాళ్లు అలాగే ముఖం మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. అందుకే మిగతా విషయాలలో తీసుకున్న జాగ్రత్త మెడ విషయంలో తీసుకోరు. అందుకే చాలామంది స్త్రీలకు ముఖం అందంగా మెరిసిపోతున్న కూడా మెడ మాత్రం నల్లగా ఉంటుంది. మెడ నల్లగా ఉంటే ఎటువంటి పెద్ద ఖరీదైన బంగారు ఆభరణాలు ధరించినా కూడా అంతా అందం రాదు. కాబట్టి అలాంటి మెడ నలుపు రంగులో ఉండకుండా తెలుగు రంగులోకి మారాలి అంటే ఎలాంటి చిట్కాలను ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొఖం కలర్ ఒకలా, మెడ కలర్ ఒకలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆడవాళ్లలో హార్మోన్ల మార్పుల వల్ల, ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మెడ భాగం నల్లగా మారుతుందని చెబుతున్నారు. కానీ ఇది ఆడవాళ్ల అందాన్ని పాడుచేస్తుంది. అలాంటివారు కొబ్బరి నూనె ఉపయోగించి మెడపై ఉన్న నలుపును పోగొట్టుకోవచ్చు అంటున్నారు. అదెలా అంటే కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి మెడ భాగం పై అప్లై చేయాలి. తర్వాత వేళ్ళతో 20 నిమిషాలు పాటు తేలికగా స్క్రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల నలుపు రంగులో ఉన్న మీ మెడ కాస్త తెలుపు రంగులోకి మారుతుందట.
అలాగే చింతపండు పెరుగు ఉపయోగించి కూడా మీ మెడ భాగాన్ని తెలుపు రంగులోకి మార్చుకోవచ్చు. చింతపండును వేడినీటిలో నానబెట్టి,గుజ్జు తీసి అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, వేసి బాగా కలపాలి. దీన్ని నల్లగా ఉన్న మెడభాగంలో అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే మెడ పై ఉన్న నలుపు మొత్తం పోతుందట. మెడపై ఉన్న నలుపు పోవాలంటే నారింజ తొక్క, పాలు కలిపి గ్రైండ్ చేసి అప్లై చేయాలి. నారింజ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెడ నల్ల బడటానికి కారణమయ్యే టైరోసిన్ సమ్మేళనాలతో పోరాడి మెడ భాగాన్ని తెలుపు రంగులోకి మారుస్తాయి. అలాగే కలబంద గుజ్జులో పంచదార, పాలు కలిపి మెడకు స్క్రబ్ చేయండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెడను తెల్లగా చేయడానికి సహాయపడతాయి.