Site icon HashtagU Telugu

Oats: ఓట్స్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం?

Oats

Oats

మనలో చాలామంది ఓట్స్ తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా ఓట్స్ ని ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ జనరేషన్లో చాలామంది పిల్లలకు కూడా వీటిని తినిపిస్తూ ఉంటారు. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచి వని, వీటిని తరచుగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో జరిగిన ఒక సర్వేలో ఓట్స్ తిన్న తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఓట్స్ తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మరి ఓట్స్ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామందికి కొన్ని రకాల వంటలు తిన్నప్పుడు కడుపు నొప్పిగా అనిపించడం వాంతులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకు గల కారణం సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియానే. ఓట్స్‌లోనూ అదే బ్యాక్టీరియా ఉంటుందతట. అది అసలు ఓట్స్‌లో ఎలా వచ్చిందని ఆరా తీస్తే ఓట్స్‌ని ప్యాకింగ్ చేసే సమయంలో అజాగ్రత్తగా ఉండడం, సరిగ్గా వండకపోవడమే ఇందుకు కారణాలుగా చెప్తున్నారు. ప్యాకింగ్ చేసేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఈ వైరస్‌లు ఓట్స్‌లోకి చేరతాయి. వాటిని సరిగ్గా ఉడికించకపోతే అనారోగ్య సమస్యలకి కారణమవుతాయని చెబుతున్నారు. ఇలాంటి ఓట్స్ తినడం వల్ల వికారం, శరీర నొప్పులు, జ్వరం, చలి ఇలా అన్నీ సమస్యలు ఇన్ఫెక్షన్స్‌ కి కారణమవుతాయట.

అదనంగా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. వీటికి సరైన విధంగా ట్రీట్‌మెంట్ చేయించకపోతే ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ప్రాణాపాయంగా మారుతుందని కూడా చెబుతున్నారు. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా చాలామంది ఇన్‌స్టంట్ ఓట్స్‌ని కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిని వండడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కని రుచికరంగా ఉంటాయని చెబు తుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దీని వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుందట. ఓట్స్‌ని కరెక్ట్‌గా 70 డిగ్రీల వరకూ ఉడికించాలట. కాబట్టి ఒకవేళ మీరు ఓట్స్ తినాలి అనుకుంటే వాటిని సరైన ఉష్ణోగ్రత వరకు బాగా ఉడికించి తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.