Site icon HashtagU Telugu

Fasting: షుగర్ ఉన్నవారు ఉపవాసం ఉండవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Navratri Fasting Tips

Navratri Fasting Tips

మామూలుగా మనం పండుగ సమయాలలో, లేదా పూజలు చేస్తున్నప్పుడు ఉపవాసం ఉండడం అన్నది కామన్. వ్రతాలు, నోములు చేస్తున్నప్పుడు కూడా ఉపవాసం ఉంటారు. వైద్యులు కూడా వారానికి ఒకసారి ఉపవాసం ఉండమని చెబుతూ ఉంటారు. ఉపవాసం ఉండడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మరి డయాబెటిస్ పేషెంట్లు ఉపవాసం ఉండవచ్చా? అలా ఉపవాసం ఉండడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ ఉన్నవారు వరుసగా ఉపవాసం ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఆహార విధానాలలో మార్పు, ఉపవాస స్వభావం, తీసుకోవాల్సిన ఫుడ్ వంటివి పాటించాలి.

ఉపవాసం ఉండే ముందు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉత్తమంగా నిర్వహించేందుకు, తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాన్ని తినడానికి రోజులో కొన్ని సార్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేయడం ముఖ్యం. నేడు సులభంగా అందుబాటులో ఉండే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలు ఇన్‌స్టంట్ గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయో చూపుతాయి. గ్లూకోజ్ స్థాయిలు ఎక్కడికి వెళ్తున్నాయో చూపుతాయి. మార్చబడిన ఆహార విధానాల కారణంగా, రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల, ఉపవాసం కోసం మీ షెడ్యూల్ గురించి డాక్టర్‌తో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇందులో ఉపవాస రోజుల సంఖ్య, తినే ఆహార క్వాంటిటీ, సమయాలు, ఏం తినాలి అనే వివరాలు ఉంటాయి.

ఎందుకంటే ఇది గ్లూకోజ్ తగ్గడం, పెరగడాన్ని నియంత్రించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్‌ని ఎంచుకోవచ్చు. ఫ్రై చేసిన మఖానా, నట్స్, గుమ్మడి కట్‌లెట్స్ ఉపవాస సమయంలో తినడంలో కడుపు నిండుగా ఉంటుంది. ఎందుకంటే అవి ప్రోటీన్ రిచ్‌గా ఉంటాయి. అదనంగా విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండే నారింజ, కివి పండ్లు తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే, అవి శరీరంలో ఇన్సులిన్ హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడతాయి. ఉపవాస సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు హైపోగ్లైసీమియా, హూపర్ గ్లైసీమియా దాడిని నివారించేందుకు, ఉపవాస సమయంలో గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేయడం చాలా ముఖ్యం.

షుగర్ ఉన్నవారు ఉపవాస సమయంలో డీహైడ్రేషన్ సమస్య ఎదుర్కొంటారు. అలాంటప్పుడు కచ్చితంగా 2 నుంచి 3 లీటర్ల నీరు తీసుకోవడం తప్పనిసరి. ఉప్పు లేని మజ్జిగ, నిమ్మరసం, గ్రీన్ టీ, పుదీనా నీరు, యాలకుల టీ, స్మూతీస్, కొబ్బరి నీరు వంటి తక్కువ కేలరీల పానీయాలు వరుసగా ఉపవాసం ఉన్న సమయంలో హైడ్రేషన్ సమస్యని దూరం చేస్తాయి. అరటిపండ్ల బదులు స్మూతీలో యాపిల్స్ వంటి పండ్లను యాడ్ తీసుకోవడం మంచిది. మీరు మీ స్మూతీకి 2 టీ స్పూన్ల అవిసె గింజలు, చియా గింజలు కూడా వేయొచ్చు. ఎందుకంటే ఇవి టైప్ 2 డయాబెటిస్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించేందుకు సాయపడతాయి. షుగర్ ఉన్నవారు ఉపవాస సమయంలో వర్కౌట్ చేయవచ్చు. అయితే, ఇది తక్కువ స్పీ్‌తో చేయాలి. ఈ సమయంలో ఒత్తిడి లేకుండా చూసుకోవడం ముఖ్యం. కాస్తా నడవడం, స్ట్రెచింగ్ వర్కౌట్స్ చేయొచ్చు. అదే విధంగా షుగర్ ఉన్న వారు ప్రోటీన్స్, సరైన కార్బోహైడ్రేట్స్ కలయికతో ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటారు.

Exit mobile version