Site icon HashtagU Telugu

Diabetes: మధుమేహం ఉన్నవారు దాల్చిన చెక్క పొడితో పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

Diabetes

Diabetes

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సుగర్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో 20 ఏళ్ల లోపు పిల్లల నుంచి కూడా ఈ సమస్య మొదలవుతోంది. ఈ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆ సంగతి పక్కన పెడితే డయాబెటిస్ పేషెంట్లు కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో దాల్చిన చెక్క పొడి పెరుగు కూడా ఒకటి. మరి ఇవి రెండు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు దాల్చిన చెక్క పొడిని పెరుగుతో కలిపి తినవచ్చు. దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందట. అదే సమయంలో పెరుగు మీ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాకు మద్దతు చక్కెర స్థాయిలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

మీ రోజువారీ ఆహారంలో పెరుగులో దాల్చిన చెక్క పొడిని కలిపి చిరుతిండిగా లేదా డెజర్ట్‌గా తినండి వోట్మీల్ లేదా పెరుగులో పెరుగు, దాల్చిన చెక్క పొడిని కలపడం పండు లేదా సలాడ్‌ల కోసం పెరుగు దాల్చిన చెక్క పొడిని టాపింగ్‌గా ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. దాల్చిన చెక్కలో పాలీ ఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతుంది. పెరుగు ప్రోబయోటిక్స్‌ ని అందిస్తుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. హార్మోన్లను సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు. అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు దాల్చిన చెక్కలో కూమరిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఇతర జబ్బులకు మందులు వాడే వారు, అలర్జీ సమస్య ఉన్నవారు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.