Site icon HashtagU Telugu

Mango Leaves: షుగర్ అదుపులోకి రావాలి అంటే మామిడి ఆకులతో ఇలా చేయాల్సిందే?

Mixcollage 29 Jan 2024 08 02 Pm 2037

Mixcollage 29 Jan 2024 08 02 Pm 2037

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్య ఉన్నవారు తరచుగా మెడిసిన్స్ ని ఉపయోగించాల్సిందే. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చింది అంటే చచ్చే వరకు పోదు. దాంతో తరచూ ఈ షుగర్ కి సంబంధించిన మెడిసిన్స్ ని ఉపయోగిస్తూనే ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు షుగర్ ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ప్రాణాలు కూడా ఆపోవచ్చు. అయితే షుగర్ అదుపులో ఉంచడంలో మామిడి ఆకులు ఎంతో బాగా ఉపయోగపడతాయి.

మామిడి ఆకుల్లో పోషకాలు బాడీలో ఉండే షుగర్ ను తగ్గించడానికి దోహదం పడతాయి. మరి ఇందుకోసం 15 మామిడి ఆకులను తీసుకొని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఆ కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా రోజ చేయడం వల్ల మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మామిడి ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది గూకోజ్ ని సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి.

అందువల్ల షుగర్ లెవల్స్ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా చేయడం వల్ల షుగర్ అదుపులో ఉండటంతో పాటు షుగర్ ద్వారా వచ్చే వ్యాధులను కూడా అరికడుతుంది. మామిడి ఆకులతో ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఒకవేళ ఈ రెమిడి పాటించే ముందు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కానీ ఆరోగ్య నిపుణులు కూడా మామిడి ఆకులు డయాబెటిస్ కు ఎంతో మంచిది అని చెబుతున్నారు. మామిడి ఆకులు డయాబెటిస్ కు చాలా మంచిది అని ఒక పరిశోధనలో కూడా తేలింది.