మామూలుగా మనలో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జనరేషన్ లో చిన్న పెద్ద అని వయసుతో తీయడం లేకుండా చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో ఎక్కువగా అజీర్ణం, మలబద్ధకం, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సమస్య రావడానికి గల కారణం జీవనశైలి ఆహారపు అలవాట్లు. అయితే చాలామందికి ఈ సమస్యలతో పాటు రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపిస్తూ ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా రాత్రి పడుకునేటప్పుడు జీర్ణ రసం జీర్ణాశయం బయటకు వస్తుంద. దీనితో పాటుగా తినే ఆహార పదార్థాల అవశేషాలు కూడా రావొచ్చ. రాత్రి పూట మసాలా ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే కొంత మందికి గుండెల్లో మంటగా అనిపిస్తుందట. రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపించినప్పుడు దానిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా రాత్రిళ్ళు వీలైనంత త్వరగా డిన్నర్ చేయడం అందరికీ మంచిది.
మీరు పడుకోవడానికి కనీసం రెండు లేదా మూడు గంటల ముందు తినాలి. ఇలా తినడం వల్ల రాత్రిపూట గుండెల్లో మంట సమస్య వచ్చే అవకాశం తగ్గుతుందట. జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందట. రాత్రిపూట మరీ హెవీగా తినడం కూడా మంచిది కాదట. ఇలా ఎక్కువగా తినేవారికి రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపించవచ్చట. అందుకే రాత్రిపూట మోతాదులో తేలికపాటి ఆహారాన్ని తినాలట. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట తక్కువగా తినాలని చెబుతున్నారు. రాత్రిపూట తక్కువగా తినడంతో పాటుగా మీ రోజువారి ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. అంటే రోజుకు మూడు సార్లు కాకుండా రోజుకు ఐదారు సార్లు లేదా రోజుకు ఏడు సార్లు కొంచెం కొంచెం తినడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందట.