కొందరికి ముఖం మీద కండలేక బుగ్గలు లోతుగా మారిపోయి బక్క చిక్కిపోయి ఉంటారు. ఇంకొందరు బొగ్గులు లావుగా ఉండి చాలా బొద్దుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలా లావుగా ఉన్నవారు బుగ్గలు ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరి బుగ్గలను ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొందరికి బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా కొంతమంది బుగ్గలు మరీ లావుగా ఉంటాయి.
బుగ్గలపై కొవ్వు పేరుకుపోవడమే ఇందుకు కారణం. చాలా మందికి డబుల్ చిన్ ఉంటుంది. దీనివల్ల ముఖ అందం తగ్గుతుందట. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందట. పాల ఉత్పత్తులు, బియ్యం, బంగాళాదుంపలు, స్వీట్లు వంటి కొన్ని ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తింటే మీ బుగ్గలు మరింత పెరుగుతాయి. అందుకే బుగ్గలు తగ్గాలంటే మాత్రం మీరు వీటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. చూయింగ్ గమ్ మన ఆరోగ్యానికి కూడా కొంత మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించి మీరు బొద్దుగా ఉండే బుగ్గలను తగ్గించుకోవచ్చట.
ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఒక గంట పాటు చూయింగ్ గమ్ ను నమలాలట. ఇలా చేయడం వల్ల బుగ్గల్లోని కొవ్వు కరిగిపోయి బుగ్గలు సన్నగా మారతాయి అని చెబుతున్నారు. అలాగే ఆల్కహాల్ ఆరోగ్యానికే కాదు శరీరానికి కూడా మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తాగితే చెంపల్లో కొవ్వు విపరీతంగా పెరుగుతుందట. బుగ్గలు సన్నగా కావాలంటే మాత్రం మీరు ఆల్కహాల్ ను తాగడం మానేయాలని చెబుతున్నారు. నిద్రకూడా మీరు బరువు పెరగడానికి, బుగ్గలు పెరగడానికి దారితీస్తుందట. కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయట. ఫలితంగా గడ్డంతో సహా శరీరమంత కొవ్వు బాగా పేరుకుపోతుందట. మీరు బరువు తగ్గాలన్నా, బుగ్గలు సన్నబడాలన్నా బాగా నిద్రపోవాలని చెబుతున్నారు. అలాగే ఫిష్ పొజీషన్ అనేది ఒక రకమైన ముఖ యోగా. దీనిలో మీ బుగ్గలను చేప నోటిలా లోపలికి లాగాలి. ఇలా ప్రతిరోజూ 5 నిమిషాల పాటు చేస్తే బుగ్గల్లోని అదనపు కొవ్వు కరిగిపోతుందట బుగ్గలు సన్నగా, అందంగా మారుతాయట. అదేవిధంగా సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో అదనపు నీటిని కలిగిస్తాయి. దీనివల్ల ముఖంపై కొవ్వు పెరుగుతుందట. ఇలా కాకూడదంటే మీరు సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానుకోవాలని చెబుతున్నారు.