Site icon HashtagU Telugu

Health Tips: బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా.. అయితే ఇలా తింటే కాన్సర్ సమస్యలు దూరం అవ్వాల్సిందే!

Health Tips

Health Tips

మామూలుగా చాలా మంది బరువు తగ్గడం కోసం చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు. అన్నానికి బదులుగా చపాతీలని ఎక్కువగా తింటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒకటి లేదా రెండు చపాతీలను ఆయిల్ లేకుండా చేసుకుని తింటూ ఉంటారు. అయితే చపాతీలు తిన్నప్పుడు మీరు సరైన విధంగా సరైన పద్ధతిలో తింటే బరువు తగ్గవచ్చట.. చపాతీలు చేసుకుని మితంగా తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గడంతో పాటు ఇంకా చాలా లాభాలు కలుగుతాయట.. అవి ఏంటో తెలుసుకుందాం.. చాలామంది చపాతీలు చేసుకోవడానికి మార్కెట్ లో దొరికే పిండిని ఉపయోగిస్తూ ఉంటారు.

కానీ అందులో కొంచెం మైదా పిండి తో పాటు ఇంకా కొంచెం కలిసి జరుగుతూ ఉంటుంది. ఆ కాబట్టి ఆ పిండి కాకుండా, మీరే స్వయంగా గోధుమలు తీసుకొని వాటితో పిండి చేసుకొని వాటితో చపాతీలు చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన ఫైబర్ ఎక్కువ మొత్తంలో అందుతుందట. అలాగే అప్పుడప్పుడు రాగులు, జొన్నలు, బజ్రా వంటివి కలిపి పట్టించడం, లేదా విడివిడిగా పట్టించి చపాతీ చేసినప్పుడు పిండి కలపడం లాంటివి చేయాలని చెబుతున్నారు. దీంతో శరీరానికి ఎక్కువ పోషకాలు కూడా అందుతాయట. హ్యాపీగా తినవచ్చని చెబుతున్నారు. చాలా మంది ఆకుకూరలు, కూరగాయలు తినరు. అలాంటప్పుడు పిండి కలిపేటప్పుడే అందులో వాటిని మిక్సీ పట్టి ఆ పేస్టు కలపడం చేయాలి. పాలకూర, బీట్‌రూట్, క్యారెట్స్ వంటి వాటిని మిక్సీ పట్టి వేయడం వల్ల రుచిగా ఉంటాయి. పోషకాలు కూడా అందుతాయి. ఇష్టమనుకుంటే తురుములా కూడా చేయవచ్చు. దీనికి కాస్తా పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జీలకర్ర కలిపారంటే కూరలు లేకుండా కూడా అలా ఎంజాయ్ చేయవచ్చు.

వీటిని కాల్చేటప్పుడు కూడా ఎక్కువగా నూనె వేయకండి. వీలైతే నాన్‌స్టిక్ పాన్ ఉపయోగించడం మంచిది. దీంతో మీకు ఎక్కువగా కేలరీలు వెళ్లవు.అయితే ఇలా చేస్తే చపాతీలను హెల్దీ అని ఎక్కువ పరిమాణంలో తింటే సమస్యలు తప్పవు. కాబట్టి తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒకటి, రెండు చపాతీలు తింటే చాలు అని చెబుతున్నారు. ఇలా చేసిన చపాతీలు తింటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కేలరీలు తక్కువగా తింటాం. కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువగా తినం. దీంతో బరువు తగ్గుతారు. అదే విధంగా, ఇందులోని ఫైబర్ కంటెంట్ షుగర్‌ని మెల్లిగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. మనం హోల్ గ్రెయిన్స్ కలిపినప్పుడు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఫైబర్ చక్కగా అందుతుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలతో పాటు సెలీనియం కూడా ఉంటుంది. దీంతో క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడిచేయకుండా ఉంటాయి. ఇందులో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.