Site icon HashtagU Telugu

Heart Stroke : ఎండల్లో తిరిగితే గుండెపోటు వస్తుందా..?

Hot Weather Affect Heart Stroke

Hot Weather Affect Heart Stroke

అంటే అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఏడాది ఎండలు (Summer weather) దంచికొడుతున్నాయి. మాములుగా మే నెలలో ఎంత వేడిగా ఉంటుందో..ఈసారి మార్చి రెండో వారం నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే ఇంట్లో నుండి కాలు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ లో చాల జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతున్నాయి. ఈ ఎండలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని..ఎండలు ఎక్కువగా తిరగవద్దని సూచిస్తున్నారు. కరోనా తర్వాత హార్ట్ ఎటాక్ (Heart Stroke) మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. వయసు తో సంబంధం లేకుండా చాలామంది చనిపోతున్నారు. ఇక ఇప్పుడు విపరీతమైన ఎండల వల్ల కూడా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శ‌రీరాన్ని ఆయిల్ మెషిన్ తో డాక్ట‌ర్లు పోలుస్తూ… వేడి సమయంలో అది ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది అని చెపుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌ట్టుకోవాలంటే.. గుండె మాములు కంటే ఎక్కువ‌గా ప‌నిచేయాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా స్కిన్ విష‌యంలో.. చ‌మ‌టను బ‌య‌టికి పంపేందుకు హార్ట్ ఎక్కువ‌గా ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతుంది. ఎండాకాలంలో ఎక్కువ‌గా చ‌మ‌ట ప‌ట్ట‌డం వ‌ల్ల‌.. ఫ్లూయిడ్స్ లాస్ అవుతాం. దీంతో ర‌క్తం చిక్కబడి.. పంప్ చేయ‌డం గుండెకు క‌ష్టం అవుతుంది. దీనివ‌ల్ల గుండె మీద ఒత్తిడి ఎక్కువై స‌రిగ్గా ప‌నిచేయదు అని డాక్ట‌ర్లు చెపుతున్నారు. ఈ ఎక్స్ ట్రా వ‌ర్క్ లోడ్ వ‌ల్ల హార్ట్ ఎటాక్ రావ‌డం, హార్ట్ ఫెయిల్ అవ్వ‌డం లాంటివి జ‌రుగుతాయ‌ట‌. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న‌వాళ్లు, డ‌యాబెటిస్, లంగ్స్ ప్రాబ్ల‌మ్స్ ఉన్న‌వారు అసలు ఎండలో బయటకు రావొద్దని అంటున్నారు. ఎండ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలని..అప్పుడే గుండెపోటు వంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అంటున్నారు.

Read Also : HD Kumaraswamy : మాజీ ప్రధాని కుమారుడితో నువ్వానేనా ? ఆ స్థానంలో పోటీ రసవత్తరం !