Site icon HashtagU Telugu

Kiwi Face Pack: మెరిసే చర్మం కోసం కివీ పేస్ ప్యాక్..

Kiwi Face Pack

New Web Story Copy 2023 08 29t181906.933

Kiwi Face Pack: మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు. అందంగా కనపడాలని, నలుగురిలో మనమే అందంగా కనపడాలని ప్రతిఒక్కరు ఆశపడతారు. ఇక మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం అంటేనే అమ్మాయి అన్నట్టుగా అలకరించుకుంటారు మగువలు. అయితే అందంగా కనపడాలన్న కొందరు ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి వెనకాడరు. కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా ముస్తాభవ్వొచ్చు. అందుకోసం బ్యూటీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్‌లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

1, కివీ పండులో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది. కివీ ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలో ఒక కివీ గుజ్జును తీసి దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ని మీ మెడ మరియు ముఖానికి అప్లై చేయండి. దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

2, ఒక గిన్నెలో ఒక చెంచా ఆలివ్ నూనె, గుడ్డులోని తెల్లసొనతో కివీ గుజ్జును తీసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ని మీ ముఖం మరియు మెడ అంతటా రాయండి. సుమారు 15 నిమిషాల పాటు ప్యాక్‌ను అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.

3. ఒక గిన్నెలో కివీ గుజ్జు, అరటిపండ్ల గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్‌స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖం మరియు మెడపై పూర్తిగా అప్లై చేయండి. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు ప్యాక్‌ని ఆరనివ్వండి, ఆపై కడగాలి.

4. కివీలో కలబంద గుజ్జు కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దీన్ని మీ ముఖం మరియు మెడ అంతటా బాగా రాయండి. దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా కివీ పండుతో ఎన్నో రకాలుగా ఇంట్లోనే పేస్ ఫ్యాక్ లు చేసుకుని అందాన్ని కాపాడటమే కాకుండా చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చుకోవచ్చు.

నోట్ : పైన ఇచ్చిన సలహాలు టిప్స్ కేవలం సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. మీకు ఏవైనా ఇబ్బందులు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.

Also Read: BRS Party: మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరికలు