ప్రస్తుత రోజుల్లో చాలామంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ తెల్ల జుట్టు కారణంగా చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఏజ్ వారికి కూడా తెల్ల జుట్టు సమస్య వేధిస్తోంది. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వాటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన కొన్ని నూనెలను వాడినా కూడా తెల్ల జుట్టు కనిపించకుండా చేసుకోవచ్చట. చిన్న ఏజ్ లోనే జుట్టు తెల్లబడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఇవి సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. చాలా మంది తెల్ల జుట్టును దాచడానికి కలర్స్ వాడుతూ ఉంటారు. ఈ కలర్స్ వారం రోజుల్లోనే పూర్తిగా తొలగిపోతాయట.
జుట్టు మళ్లీ తెల్లగా కనిపిస్తుందట. ఈ రంగుల్లో రసాయనాలు ఉండటం వల్ల అవి జుట్టుకు ఎంతో హాని చేస్తాయట. అందుకే ఇంట్లో తయారుచేసిన హెయిర్ ఆయిల్స్ ను వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుందని,జుట్టు రాలడం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఆ నూనెలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట. కొబ్బరి నూనెలో ఉసిరి రసాన్ని కలిపి తలకు పట్టించడం వల్ల నెత్తిమీద మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుందట. అలాగే తెల్ల వెంట్రుకలు రావడాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ నూనె మీ జుట్టును బలంగా కూడా చేస్తుందట. జుట్టు సంరక్షణ కోసం మూలికల రాజు అని పిలువబడే బృంగరాజ్ తెల్ల జుట్టు మరింత పెరకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట.
ఈ నూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నువ్వుల నూనెతో కలిపినప్పుడు ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుందట. జుట్టు తెల్లబడకుండా చేయడానికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. గోరింటాకును జుట్టును ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది సహజ రంగు, కండిషనర్ గా బాగా ఉపయోగపడుతుందట. విటమిన్ ఇ, విటమిన్ బి లు ఎక్కువగా ఉండే బాదం నూనెలో గోరింటాకును కలిపినప్పుడు, ఇది సూక్ష్మమైన ఎరుపు రంగును జోడిస్తుందట.
అలాగే జుట్టు కుదుళ్లను బలపరుస్తుందని చెబుతున్నారు. అలాగే సహజంగా తెల్లబడిన జుట్టును కవర్ చేస్తుందని, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. రోజ్ మేరీ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుందట. అలాగే దీనిలో స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యం కూడా ఉందట. ఇకపోతే ఆలివ్ ఆయిల్ లోతైన తేమను అందిస్తుందని, రోజ్ మేరీ ఆకులను ఆలివ్ ఆయిల్ లో కలిపి మసాజ్ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుందట. అలాగే రంగు కూడా మెరుగుపడుతుందట. మొత్తం స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, తెల్లబడే ప్రక్రియను తగ్గించేందుకే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందని చెబుతున్నారు. బ్లాక్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి సహజంగా జుట్టును నల్లగా చేయడానికి, మంచి రంగును ఇవ్వడానికి బాగా సహాయపడతాయని, జొజోబా నూనె, స్కాల్ప్ సహజ నూనెలను పోలి ఉంటుందని, ఇది జుట్టును హైడ్రేట్ చేయడానికి, సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.