Dandruff Tips: చుండ్రును వదిలించే ఇంటి చిట్కాలు

చుండ్రు సమస్య ఎంతోమందిని వేధిస్తుంటుంది. ఇది ఒక రకమైన చర్మవ్యాధి.

చుండ్రు (Dandruff) సమస్య ఎంతోమందిని వేధిస్తుంటుంది. ఇది ఒక రకమైన చర్మవ్యాధి. ఆంగ్లంలో దీన్ని ‘పిటిరియాసిస్ సింప్లెక్స్ క్యాపిల్లిటీ’ అని పిలుస్తారు. ఈ ప్రాబ్లమ్ వల్ల చికాకుగా ఉంటుంది. త‌ర‌చూ త‌ల దుర‌ద‌పెడుతుంది. బ‌ట్ట‌ల‌పై డాండ్ర‌ఫ్‌ రాలి అసౌక‌ర్యంగా ఉంటుంది.

ఆ ఫంగస్ వల్లే..

మన వెంట్రుకల్లో డాండ్రఫ్‌కు ప్రధానంగా మాలాసిజియా గ్లోబోసా అనే ఫంగస్ కారణం అవుతుంది. మన చర్మం, వెంట్రుకల్లో సహజంగా ఉన్న నూనెను ఈ ఫంగస్ పీల్చేసుకుంటుంది. కానీ, అదే సమయంలో ఈ ఫంగస్ ఓలెయిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల మన తలపైన దురద పెట్టడం మొదలవుతుంది. ఈ ఫంగస్ కొంతమందిలో రోగనిరోధక స్పందనను కూడా అడ్డుకుంటుంది. దాంతో తలపైన చర్మం పొడిబారిపోయి పొక్కులు రావడం మొదలవుతుంది.

చుండ్రు (Dandruff) ఇతర ల‌క్ష‌ణాలు..

  1. మలబద్దకం, అపక్రమ బౌల్ సిండ్రోమ్
  2. పొలుసుల చర్మం
  3. ఛాతీపై దద్దుర్లు
  4. తల దురదగా ఉండడం
  5. నెత్తిమీద ఎరుపు రంగు రావడం
  6. చెవి తామర
  7. నెత్తిమీద తెల్లటి రేకులు
  8. పొడి రేకులు కలిగిన జిడ్డుగల చర్మం
  9. కనుబొమ్మ , కనురెప్ప, గడ్డంలో దద్దుర్లు
  10. దురదగా అనిపించడం..
  11. చుండ్రుకు గ‌ల కార‌ణాలు..
  12. సెబమ్ అధిక ఉత్పత్తి
  13. సెబోరోహెయిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా లేదా సోరియాసిస్ స‌మ‌స్య‌లు
  14. పొడి బారిన చర్మం
  15. జుట్టు సంరక్షణ ఉత్పత్తులకు రియాక్ష‌న్‌
  16. అధిక జిడ్డుగల చర్మం
  17. మలాసెజియా లాంటి అంటువ్యాధులు

ఏ షాంపూ బెస్ట్?

యాంటీ ఫంగల్ షాంపూల ప్రభావం వల్ల కొంత కాలం తర్వాత మీకు చుండ్రు తగ్గినట్లు అనిపించవచ్చు. అందుకే చుండ్రు వదిలించుకోడానికి మీరు అప్పుడప్పుడూ వేరే ప్రత్యామ్నాయాలు ఉపయోగించాల్సి ఉంటుంది. కోల్ టార్ షాంపూ చర్మం టర్నోవర్ ప్రక్రియను నెమ్మది చేస్తుంది. దీనితోపాటూ తలపై పొక్కులు రాకుండా ఉపశమనం పొందడానికి సాలిసిలిక్ యాసిడ్‌ ఉన్న షాంపూ ఉపయోగించవచ్చు. అయితే, జింక్ లేదా సెలేనియం ఉన్న షాంపూలు కూడా ఫంగస్‌ను అడ్డుకోవడానికి సాయం చేస్తాయి.

ఈ కింది రసాయనాలు ఉన్న షాంపూలు ఉపయోగించి చుండ్రు (Dandruff) వదిలించుకోవచ్చు.

  1. జింక్ పైరీథియోన్
  2. సాల్సిలిక్ యాసిడ్
  3. సెలీనియం సల్ఫైడ్
  4. కెటోకానాజోల్
  5. కోల్ టార్

చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటే దాదాపు ఒక నెల పాటు యాంటీ-డాండ్రఫ్ షాంపూ ఉపయోగించి చూడాలి. మీరు కావాలంటే ఒకటి కంటే ఎక్కువ యాంటీ డాండ్రఫ్ షాంపూలు ఉపయోగించి చూడవచ్చు. దాని వల్ల ఏ షాంపూ మీ చుండ్రు వదిలించడానికి బాగా పనిచేస్తోందో మీకు తెలుస్తుంది.

చుండ్రు (Dandruff) నివారణకు ఆయుర్వేద చిట్కాలు

వేపనూనె, ఆలివ్‌ ఆయిల్‌

వేపనూనె, ఆలివ్‌ ఆయిల్‌లను సమభాగాల్లో కలిపి వేడి చేయాలి. ఆ మిశ్రమం గోరు వెచ్చగా ఉండగానే తలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

అల్లం ముక్క,నువ్వుల నూనె

చిన్న అల్లం ముక్కను తీసుకుని సన్నగా కట్‌ చేయాలి. వాటిని నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఒక్కసారి ఇలా చేసినా చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, అరటి పండు గుజ్జు

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను 2 టీస్పూన్ల లో తీసుకుని దానికి కొద్దిగా అరటి పండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి.

నారింజ పండు తొక్క పేస్ట్

నారింజ పండు తొక్కను సేకరించి దాన్ని బాగా నూరి పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. తరువాత గంట సేపు అలాగే ఉండాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తే సమస్య తగ్గుతుంది.

నీరు, ఉప్పు

ఒక కప్పు నీటిలో 2-3 టేబుల్‌ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 10 నిమిషాల పాటు ఉంచి తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఒక రోజు ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.

కలబంద గుజ్జును తలకు బాగా పట్టించి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.

యాపిల్‌ జ్యూస్‌:

2 టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ జ్యూస్‌ను తీసుకుని అంతే మొత్తంలో నీటిని కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. తరువాత 30 నిమిషాలపాటు ఆగి తలస్నానం చేయాలి.

Also Read:  After Sunset: నింగిలో మూడు నక్షత్రాలు దర్శనమిస్తున్న ఘటన