Pores On Face : ముఖం మీద ఆ విధంగా కనిపించకుండా ఉండాలంటే…!!

ఈ రోజుల్లో అతివలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా సౌందర్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 01:35 PM IST

ఈ రోజుల్లో అతివలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా సౌందర్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి. చర్మ రంద్రాలు పెద్దవిగా కనిపించడం ఇదొక సమస్య. మనం ఉపయోగించే మేకప్ లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు ఇలా ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చర్మ రంద్రాలు పెద్దగా మారడం వల్ల ముఖం చర్మంపై చిన్న చిన్న గుంతలుగా ఏర్పడతాయి. వయస్సు పై బడిన ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ సమస్యలన్నీ కొందరికి కంటి మీద కునుకు లేకండా చేస్తాయి. అయితే వీటి పరిమాణాన్ని తగ్గించడం అసాధ్యం. కానీ వీటిని కనిపించకుండా చేసే పలు సహజసిద్దమైన సౌందర్య చిట్కాలు చాలానే అందుబాటులో ఉన్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

రోజులో రెండు సార్లు!
ముఖంపై ఏర్పడిన పెద్ద పెద్ద రంద్రాలు కనిపించకుండా ఉండాలంటే రోజుకు కనీసం రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖంపై పొలుసుల్లా మారిన చర్మాన్ని తొలగించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో చర్మ రంద్రాల్లో చేరిన దుమ్ము-ధూళి, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి. ఫలితంగా మ్రుతకణాలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. దీనికి నిమ్మరసం, గులాబీ నీళ్లు సమపాళ్లలో కలుపుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది.

మృతకణాలు తొలగించుకోవాలి!
చర్మంపై ఏర్పడిన రంద్రాలు కనిపించకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు మ్రుతకణాల్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. దీనికి కోసం రెండు టీస్పూన్ల చక్కెర లేదా బ్రౌన్ షుగర్ లో సరిపడినంత ఆలివ్ నూనె వేసి కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేయాలి. పదినిమిషాల తర్వాత గోరవెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

తేమను అందించండి!
జిడ్డు చర్మం ఉన్నవారు ప్రత్యేకంగా మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ చర్మ రంద్రాలు కనిపించకుండా చేయాలంటే ఏ చర్మతత్వం ఉన్నవారైనా సరే..మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. కలబంద గుజ్జును ముఖానికి పట్టించి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా చేస్తే ముఖ చర్మంపై పేరుకున్న అధిక జిడ్డు తొలగిపోతుంది. తాజాగా కనిపిస్తుంది. అలాగే ముఖానికి మెరుపు వస్తుంది.

చర్మం బిగుతువుగా ఉండాలంటే..!
చర్మం వదులుగా ఉంటే ముడతలు పడటం, గుంతలు ఎక్కువగా ఏర్పడటం వంటివి మనకు తెలిసిందే. అందుకే చర్మాన్ని బిగుతుగా మార్చుకుంటే యవ్వనంతో మెరిసిపోవచ్చు. చర్మ రంధ్రాలు కనిపించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీనికోసం ఐస్ ముక్కతో ముఖంపై రుద్దాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.