Sensitive Teeth: పళ్ళు జివ్వుమంటున్నాయా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?

ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది సెన్సిటివిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ సెన్సిటివిటీ కారణంగా చల్లని పదార

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 08:31 PM IST

ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది సెన్సిటివిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ సెన్సిటివిటీ కారణంగా చల్లని పదార్థాలు,తీయని పదార్థాలు చివరికి వేడి పదార్థాలు తిన్నా కూడా పళ్ళు జివ్వుమంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఈ నొప్పి తీవ్రం అయ్యి దవడలు వాడడం పండ్లు ఊడిపోవడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. కొన్ని సార్లు నొప్పి భరించలేనంతగా ఉంటుంది. ఈ బాధను తట్టుకోలేక ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉంటుంటారు. పళ్ల సెన్సిటివిటీ కారణంగా హాయిగా ఏమీ తినలేరు, తాగలేరు. కొందరికి తీపి పదార్థాలు ఇష్టమైన సరే ఈ నొప్పి కారణంగా వాటికి దూరంగా ఉంటారు. అయితే ఈ సమస్యను కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి పరిష్కరించుకోవచ్చు. మరి అందుకోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సున్నితమైన దంతాల సమస్యను పరిష్కరించడానికి, ఉప్పు నీళ్లు బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఇది దంత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఉప్పులో ఉండే క్రిమినాశక గుణాలు మంటను తగ్గించేందుకు తోడ్పడతాయి. పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు రెండుసార్లు ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఇది మీ నోటి ఆరోగ్యానికి అద్భుతమైన మౌత్ వాష్‌గా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గ్లాస్‌ వేడి నీటిలో 1/2 టీస్పూన్‌ ఉప్పు వేసి వీటిని నోటిలో వేసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల ఆ సెన్సిటివిటీ సమస్య నుంచి పొందవచ్చు. అలాగే తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇది దంత సమస్యలను పరిష్కరిస్తుంది. పంటి నొప్పి, మంటను తగ్గస్తుంది.

వాపు నుంచి ఉపశమనం ఇస్తుంది. పంటి నొప్పి, పళ్ల సెస్సిటివిటీని తగ్గిస్తుంది. మీరు పళ్ల సెన్సిటివిటీతో బాధపడుతుంటే1 గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె వేసి పుక్కిలించడం వల్ల అది పళ్లు జివ్వుమనడాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఒక టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ ఆవాల నూనె వేసి పేస్ట్‌లా చేసి ఈ పేస్ట్‌ను దంతాలు, చిగుళ్లపై రాస్తుండాలి. ఇలా తరచుగా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా మంది బరువు తగ్గాడానికి గ్రీన్‌ టీ తాగుతూ ఉంటారు. గ్రీన్‌ టీ పళ్ల సెన్సిటివిటీ తగ్గించడానికీ సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రీన్ టీని మౌత్ వాష్‌గా ఉపయోగించండి. రోజుకు రెండు సార్లు నోటిలో గ్రీన్‌ టీ వేసుకుని పుక్కిలించాలు ఇది దంతాలను బలోపేతం చేయడానికి, మంటను తగ్గించడానికి తోడ్పడుతుంది.