Site icon HashtagU Telugu

Lips: పగిలిన పెదవులకు అద్భుతమైన చిట్కాలు.. అవేంటంటే?

Lips

Lips

చాలామందికి ఈ పదే పదే పెదాలు పొడిబారుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా చలికాలంలో పెదవులు పగలడం రక్తం రావడం లాంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. దీంతో పెదవులు పగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి పెదవులు పగిలినప్పుడు ఎటువంటి చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెదవులు పగిలినప్పుడు తేనే చక్కెరను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందుకోసం తేనె పంచదారను మిక్స్ చేసి పెదవులకు అప్లై చేసి 5 లేదా 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

అలాగే కొబ్బరి నూనె కూడా పగిలిన పెదాలకు ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల చర్మంపై తీమశాతం పెరుగుతుంది. కాబట్టి పెదవులకు కొబ్బరి నూనె పూసుకోవడం వల్ల పెదవులు మృదువుగా మారి గులాబీ రంగులోకి మారతాయి. పొడిబారిన పెదవులకు పాలు కూడా ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఇందుకోసం పాలలో కాస్త కాటన్ ను ముంచి పెదవులపై అప్లై చేసి మాశ్చరైజ్ చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల పెదవులు ఎండిపోకుండా పగుళ్లు రాకుండా ఉంటాయి. పగిలిన పెదవులకు గులాబీ రేకులు కూడా బాగా సహాయ పడతాయి. ఇందుకోసం గులాబీ రేకులను పాలతో మిక్స్ చేసి పెదవులకు అప్లై చేయాలి.

గులాబీ రేకుల్లో ఉండే విటమిన్ ఈ పెదవులకు పోషణను అందిస్తుంది. కలబంద కూడా పెదవులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పెదవులు పగిలిన వారు కలబందను పెదవులపై అప్లై చేయడం వల్ల మృదువుగా తయారవుతాయి. రాత్రి పడుకునే సమయంలో కలబంద జెల్ ను పెదాలకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే చల్లని నీటితో కడగడం వల్ల పెదవులు పింక్ కలర్ లోకి మారుతాయి. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మకాయలు పొడిబారిన పెదవులకు బాగా పనిచేస్తాయి. ఇందుకోసం ఆముదం నూనె తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి దానిని పెదవులకు అప్లై చేసి పదినిమిషాల తర్వాత కడిగేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.