Constipation: చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ కారణంగా చాలా తక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే ఇలా తక్కువ నీరు తాగడం వల్ల డిహైడ్రేషన్ సమస్య మాత్రమే కాకుండా చర్మం పొడిబారడం, పెదవులు పొడి బారడం వంటి సమస్యలు వస్తాయట. తక్కువ నీరు తాగడం వల్ల కడుపు శుభ్రం కాదని, దీనివల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుందని, మలబద్ధకం నుంచి బయటపడాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
కాగా చలికాలంలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్య మలబద్దకం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మనం సరైన ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా మలబద్దకం సమస్య ఏర్పడవచ్చట. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఎక్కువగా దాహం వేయదు. దీంతో మనం నీరు ఎక్కువగా తీసుకోము. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుందట. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు, ప్రేగులు పొడిగా మారి మలవిసర్జన కష్టమవుతుందట.
శారీరక శ్రమ తగ్గడం కూడా ఒక కారణం కావచ్చని, ఉదయం లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిలో అర చెక్క నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగాలని, ఇది ప్రేగులను త్వరగా శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలిక మలబద్ధకం ఉంటే, రాత్రిపూట గోరువెచ్చని నీటితో ఒక చెంచా త్రిఫల చూర్ణం తీసుకోవాలట. లేదా 5 నుంచి 6 ఎండుద్రాక్షలను పాలలో మరిగించి, ఆ పాలు తాగినా ఉదయానికి కడుపు శుభ్రపడుతుందని చెబుతున్నారు. చలికాలంలో దాహం వేయకున్నా రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలట. ఆహారంలో ఫైబర్, సలాడ్లు చేర్చాలట. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు చిన్నపాటి వ్యాయామాలు చేయాలని లేదా ఆహారం తిన్న వెంటనే కాసేపు నడవాలని చెబుతున్నారు.
Constipation: చలికాలంలో మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Constipation