మామూలుగా వెక్కిళ్లు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వచ్చి ఆగిపోతే మరికొన్నిసార్లు చాలా సేపటి వరకు అలాగే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇలా కంటిన్యూగా ఇది వెక్కిళ్లు రావడం అన్నది అన్నది కాక ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలా వెక్కిళ్లు తరచుగా వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని నీళ్లు తాగినా కూడా వెక్కిళ్లు మాత్రం ఆగవు. అలాంటి సమయంలో కొంతమంది మెడిసిన్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అవేమీ లేకుండా క్షణాల్లో వెక్కిళ్లను ఎలా మాయం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెరుగు ఉప్పు కలిపి తీసుకుంటే వెక్కిళ్లు చాలా ఫాస్ట్ గా తగ్గించుకోవచ్చట. నీరు తాగినా కూడా వెక్కిళ్లు ఆగకుండా అలాగే వస్తుంటే వెంటనే పెరుగు ఉప్పు కలిపి తినాలని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే వెక్కిళ్లు ఆగిపోతాయట. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుందని చెబుతున్నారు. అయితే వెక్కిళ్లు ఎక్కువగా వస్తున్న వారు వాటిని ఆపడం కోసం శ్వాసను కొన్ని సెకండ్ల పాటు అలాగే పట్టుకుని ఉంచాలట. ఇలా చేస్తే వెంటనే వెక్కిళ్లు ఆగిపోతాయని చెబుతున్నారు. అలా అని శ్వాస ఆడకుండా ఎక్కువ సేపు ఉంటే మాత్రం ప్రాణాలు పోవచ్చు. కాబట్టి వెక్కిళ్లు తగ్గే వరకు అలా శ్వాసన కొన్ని సెకండ్ల పాటు ఆపడం మంచిదని చెబుతున్నారు. ఎక్కిళ్లు తగ్గిపోవడానికి నాలుకను బయటకు తీస్తే కూడా సరిపోతుందని చెబుతున్నారు. అవును ఎక్కిళ్లు వస్తున్నప్పుడు మీరు మీ నాలుకను కాసేపు బయటకు తీసి, మీ వేలితో నాలుక చివరను పట్టుకొని వదలాలట. తిరిగి నాలుకను లోపలకు తీసుకోవాలట. దీని వల్ల ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయనీకు చెబుతున్నారు.
చాలా మందికి తినేటప్పుడు కూడా ఎక్కిళ్లు బాగా వస్తుంటాయి. ఇలాంటప్పుడు మీరు వెక్కిళ్లను తగ్గించుకోవడానికి ముక్కు మూసుకుని శ్వాసను పట్టుకుని నీళ్లు తాగితే సరిపోతుందట. దీనివల్ల కూడా ఎక్కిళ్లు తొందరగా తగ్గిపోతాయని చెబుతున్నారు. కాగా నిమ్మకాయ కూడా ఎక్కిళ్లను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. అందుకే వెక్కిళ్లు వచ్చినప్పుడు నిమ్మకాయ ముక్కను కట్ చేసి నోట్లో పెట్టుకోవాలట. ఇలా చేస్తే వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయని చెబుతున్నారు.