ప్రస్తుతం రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో మలబద్ధకం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మొలల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మొలలు వచ్చినప్పుడు బాత్రూం కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ నొప్పి వర్ణనాతీతం అని చెప్పాలి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫ్రై ఫుడ్, జంక్ ఫుడ్స్ తినకుండా ఉంటే చాలావరకు ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చట. అలాగే తగినంత నీళ్లు తాగడం వల్ల, వ్యాయామం చేయడం ద్వారా కూడా పైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చట. అలాగే మైదాతో చేసిన ఆహారాలు అస్సలు తినకూడదని చెబుతున్నారు. మెక్సికన్ చిప్స్, మైదాతో చేసిన కొన్ని ఆహారాలు శరీరంపై చెడు ప్రభావం చూపిస్తాయట. ఇలాంటివి తినడం వల్ల రక్తనాళాల్లో మంట, వాపు వస్తాయని చెబుతున్నారు. కాగా పైల్స్ సమస్యతో బాధపడేవారు వేప ఆకుల నీళ్లను ఆ ప్రదేశంలో రాయాలట. ఐస్ క్యూబ్స్ ను ఒక క్లాత్ లో వేసి మొలలున్న దగ్గర పెడితే అక్కడ వచ్చే దద్దులు, దురద వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
అలోవెరా, బొప్పాయి కూడా పైల్స్ నివారణకు చక్కగా ఉపయోగపడుతుందట. ప్రతిరోజు వాకింగ్, యోగా చేయడం ద్వారా మొలలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మొలలను నివారించవచ్చట. మొలల సమస్యను త్వరగా గుర్తించాలని ఈ సమస్య పెద్దదైతే ఇక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్నిసార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.