Tooth Pain: పంటి నొప్పి ఇది కంటికి కనిపించదు కానీ ఆ నొప్పి భరించే వారికి మాత్రమే తెలుసు. పంటి నొప్పి కారణంగా తినలేరు,తాగలేరు, మాట్లాడలేరు. కొన్ని కొన్ని సార్లు పంటి నొప్పి కారణంగా తల నొప్పి, ముఖంలో వాపు వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ పంటి నొప్పి తగ్గించుకోవడానికి ఆయింట్ మెంట్, టాబ్లెట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా ఈ నొప్పి కొన్ని సార్లు తగ్గదు. మరీ ఈ నొప్పి తగ్గాలి అంటే ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పంటినొప్పి వల్ల దవడల చుట్టూ భరించలేని నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి చాలా సార్లు రోజుల తరబడి ఉంటుందట.
కొన్ని సార్లు గంటల్లో తగ్గిపోతుంది. అయితే ఈ నొప్పి వచ్చినప్పుడు వెంటనే ఎలా తగ్గించుకోవాలో చాలా మందికి తెలియదు. మన ఇంట్లో కొన్ని పదార్థాలతో కూడా ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పుచ్చు పళ్లు, పంటి నొప్పిని తగ్గించుకోవడానికి మీరు లవంగం నూనెను ఉపయోగించవచ్చట. ఈ నొప్పిని తగ్గించడంలో లవంగం నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. ఈ లవంగం నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయట. పంటి నొప్పి తగ్గడానికి దూది తీసుకుని దానిపై రెండుమూడు చుక్కల లవంగం నూనె వేసి పంటిపై పెట్టాలట.
10 నిమిషాల తర్వత తీసేసి గోరువెచ్చని నీళ్లతో పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుందట. ఉప్పు, పసుపును ఉపయోగించి కూడా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చట. ఇది పళ్లను శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుందట. అలాగే పంటి ఇన్పెక్షన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనితో పంటి నొప్పిని తగ్గించుకోవడానికి ఒక స్పూన్ పసుపులో కొంచెం ఉప్పును వేసి కలపి దీన్ని నొప్పిగా ఉన్న పంటిపై ఐదు నిమిషాలు ఉంచాలని చెబుతున్నారు. తర్వాత నోటిని గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. వేపాకుల్లో కూడా ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ ఆకులను ఉపయోగించి మనం ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.
వీటిలో పంటినొప్పి కూడా ఉంది. అవును వేపాకులను ఉపయోగించి మనం పంటి నొప్పిని తొందరగా తగ్గించుకోవచ్చట. ఎన్నో ఏండ్ల నుంచి దంతాలను బలంగా ఉంచుకోవడానికి వేపను ఉపయోగిస్తూ వస్తున్నారు. పంటి నొప్పి తగ్గడానికి కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా చేయాలి. ఈ పేస్ట్ ను నొప్పిగా ఉన్న పంటిపై రాయాలి. పుచ్చు పళ్లకు కూడా దీన్ని రాసుకోవచ్చట. దీనివల్ల నొప్పి తగ్గుతుందట. అలాగే పళ్లు పుచ్చుపోయే అవకాశం కూడా తగ్గుతుందట. దంతాలు బలంగా అవుతాయని, రోజూ వేప పుళ్లతో తోమడం కూడా మంచిదని చెబుతున్నారు. వెల్లుల్లిలో ఉండే ఔషద గుణాలు పంటి నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడతాయట. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
మీకు పంటి నొప్పి వచ్చినప్పుడు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను నలిపి అందులో కొంచె ఉప్పును వేసి కలపాలట. దీన్ని నొప్పిగా ఉన్న పంటిపై పెడితే వెంటనే పంటి నొప్పి తగ్గిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా పంటి నొప్పి తగ్గడానికి గోరు వెచ్చని నీళ్లు బాగా ఉపయోగపడతాయట. ఇందుకోసం గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తీసుకుని అందులో కొంచెం కల్లుప్పును వేసి కలపాలని, వీటిని పుక్కిలిస్తే దంతాల సందుల్లో ఉండే క్రిములు తొలగిపోతాయని, మురికి కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ వాటర్ ను పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, పంటి నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
Tooth Pain: పంటి నొప్పిని భరించలేక పోతున్నారా.. అయితే ఇది పెడితే క్షణాల్లో నొప్పి మాయం!

Tooth Pain