తలనొప్పి అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. సరిగా భోజనం తీసుకోకపోవడం, అతిగా ఆలోచించడం, ఎండలో ఎక్కువసేపు బయట తిరగడం,స్ట్రెస్ కి గురవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి రాగానే చాలామంది చేసే పని వెంటనే ట్యాబ్లెట్స్ మింగడం. అయితే ఇలా టాబ్లెట్స్ తో తల నొప్పిని తగ్గించుకోవడం మంచిదే కానీ ఇది తరచూ అలవాటు చేసుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. మరి తలనొప్పి తగ్గాలి అంటే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మొదటి తలనొప్పికి కారణం అయ్యే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్, చాక్లెట్, చీజ్, ఏదైనా పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ..కూడా తలనొప్పి రావడానికి కారణం కావచ్చు. అంతేకాదు.. మీకు తలనొప్పి మొదలౌతోంది అనగానే.. ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ లాంటి వాటికి దూరంగా ఉండటం మొదలు పెట్టాలని చెబుతున్నారు. ఇకపోతే అల్లం తలనొప్పి తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే ఉపశమనం కూడా లభిస్తుంది.
అల్లం తలలోని రక్తనాళాలను వాపును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది కాబట్టి, ఇది మైగ్రేన్ సమయంలో వచ్చే వికారాన్ని అణచివేయడంలో కూడా సహాయపడుతుంది. అల్లం టీ తాగడం లేదంటే అల్లం పొడిని తీసుకున్నా సరిపోతుందట.పుదీనా దాని రిఫ్రెష్ సువాసనతో, తలనొప్పికి కారణమయ్యే అడ్డుపడే రక్త నాళాలను తెరవడానికి సహాయపడుతుందట. ఇందులో మెంథాల్ ఉంటుందమకెన్, ఇది శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుందట. చల్లని, చీకటి గదిలో సువాసనను నిశ్శబ్దంగా పీల్చుకోవాలట..మీరు ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెలో 3 చుక్కల పిప్పర మెంటు నూనెను కలపవచ్చు.