శీతాకాలంలో జలుబు (Cold), దగ్గు (Cough) సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు. వీటితో విసుగ్గానే ఉంటుంది. జలుబు (Cold), దగ్గు (Cough) నుంచి ఉపశమనానికి తీసుకోవలసిన ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం. ఉపశమనం కలిగించే కొన్ని ఆహారాలు మన వంటగదిలో సులభంగా లభించే పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక దగ్గు, జలుబు కోసం హోమ్ రెమిడీస్ తీసుకుంటే అవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అల్లం, నెయ్యి, బెల్లం, నువ్వులు, పసుపు, నల్ల మిరియాలు ఇవి ఇంకా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.
- 100 గ్రాముల అల్లం తీసుకుని మంటపై కాల్చండి.
- అల్లం మీద పై పొట్టును తీసివేసి, ముద్దగా నూరుకోవాలి.
- ఒక పాన్‌లో, 1 స్పూన్ నెయ్యి, 200 గ్రాముల బెల్లం వేసుకోవాలి.
- కావాలంటే కొంచెం నీళ్లు చల్లుకోవచ్చు పాకంలా మారేంత వరకూ ఉడికించాలి.
- ఉప్పు, పసుపు, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి, అల్లం ముద్ద వేయాలి.
- అన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత , ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.
- మిశ్రమం చల్లబడేలోపు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని వాటిని త్వరగా షేప్ చేయండి.
- వేయించిన నువ్వుల గింజలతో ఉండలు చుట్టి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి.
జలుబు లక్షణాల నుండి ఉపశమనానికి దీనిని వాడితే ఉపశమనం కలుగుతుంది. అల్లం ఒక డయాఫోరేటిక్, ఇది లోపలి నుండి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ ఉన్నప్పుడు సహాయపడుతుంది. గొంతు నొప్పిని ఉపశమనం కలుగుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ కూడా.
Also Read: Neura Link: ఎలాన్ మస్క్ ‘న్యూరా లింక్ ప్రయోగాల్లో జంతు మరణాలు