ప్రస్తుత రోజులో ఎక్కువ శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి. కడుపుకు సంబంధించిన అనేక రకాల సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో ముఖ్యంగా వేసవిలో వేడి కారణంగా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కాకపోతే చాలా సమస్యలు వస్తాయి. దీని కారణంగా కడుపు ఉబ్బరం, ఎసిడిటి సమస్యలు వస్తున్నాయి. చాలామంది వేసవిలో ఎసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాంతులు, లూజ్ మోషన్ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
మరి అటువంటి సమయంలో వేసవిలో ఎసిడిటీ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతులు, సోంపు గింజలు మెంతి, సోంపు గింజల్లో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి పొట్టలో పేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం మెంతి గింజలను రాత్రి నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఇలా ప్రతి రోజూ చేస్తే వేసవిలో హెల్తీగా ఉంటారు.
అలాగే కొబ్బరి వేడి వాతావరణంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. కొబ్బరి నీళ్లలో డిటాక్సిఫైయింగ్ గుణాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యకూడా దూరం అవుతుంది. అలాగే మజ్జిగ తాగడం వల్ల ఎసిడిటీ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ వేసవి కాలంలో పొట్టను చల్లగా ఉంచుతుంది. ఇందులోని సహజ బ్యాక్టీరియా కడుపులో అధిక మొత్తంలో యాసిడ్ ఏర్పడకుండా చేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేడివేడిగా భోజనం చేసిన తర్వాత మజ్జిగ తీసుకుంటే ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది.
అల్లం జీర్ణక్రియ, పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అల్లం, దోసకాయ రైతా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందలో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో అరటి అరటిపండు తింటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకు ఒక అరటిపండు తినాలి. అరటిపండులో ఉండే పొటాషియం పొట్టలో అధిక ఆమ్లత్వం ఏర్పడకుండా నిరోధిస్తుంది, ఇది శరీరంలోని pH స్థాయిని తగ్గిస్తుంది. అరటిపండులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరి ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా లభించే తాటి ముంజలు టెట్టీ తినడం వల్ల నీటి లోటు తీరుతుంది. Aa గుజ్జుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , ఫైబర్ యాసిడ్ రిఫ్లక్స్ కడుపు సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. తాటి కడుపుని చల్లగా ఉంచుతుంది న్