High Thirst : ఎక్కువగా దాహం వేస్తోందా.. అయితే మీరు ఆ అనారోగ్య సమస్యల బారిన పడినట్లే?

మామూలుగా వైద్యులు శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని అయినా తాగాలని వ

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 05:30 PM IST

మామూలుగా వైద్యులు శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగాలని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని అయినా తాగాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇలా సరైన మోతాదులో తగినన్ని నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక రకరకాల సమస్యలను తరిమికొట్టవచ్చు. తగినన్ని నీళ్లు తీసుకోకపోతే బాడీ డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు రోజుకు ఐదు లీటర్ల నీటిని తాగినప్పటికీ ఇంకా ఎక్కువగా దాహం వేస్తే మీ శరీరంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఎంత నీరు తాగినా కూడా పదే పదే దాహం వేస్తోంది అంటే ఏవో సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి.

మరి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటే అది దేనికి సంకేతమో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.. దాహం ఎక్కువగా వేస్తే శరీరంలో అంతర్గత సమస్యలు ప్రాణాంతక పరిణామాల వరకు తీసుకెళ్తాయి. కాబట్టి అధిక దాహం వేసినపుడు శరీరం పట్ల అశ్రద్ధ వహించవద్దు. బాడీలో బ్లడ్ పర్సంట్ తక్కువగా ఉన్నపుడు దాహార్తి ఉంటుంది. బ్లడ్‌లో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నా మళ్లీ దాహం వేస్తుంది. ఎనీమియా రక్తహీనత ఉన్న వారిలోనూ అధిక దాహార్తి ఉంటుంది. ఇకపోతే పదే పదే నీళ్లు తాగుతున్నారంటే షుగర్ ఇష్యూ కూడా మీ బాడీలో ఉన్నట్లే. ప్రతీ సారి నీళ్లు తాగితే మంచిదేనని అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది.

ఎక్కువగా దాహం వేయడం షుగర్ ప్రైమరీ లక్షణం, కాబట్టి దాహం అతిగా వేసే వారు కంపల్సరీగా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. బ్లడ్‌లో అవసరానికి మించి క్యాల్షియం ఉంటే కూడా అధిక దాహం సమస్య ఉత్పన్నమవుతుందని అర్థం. ఈ క్రమంలోనే తగు జాగ్రత్తలు పాటించడంతో పాటు అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిది.