హై ఫ్యాట్, హై క్యాలరీస్(High Fat and Calories) తో కూడిన ఆహారాన్ని రెగ్యులర్ గా తినడం వల్ల బ్రెయిన్ యొక్క క్యాలరీ ఇన్ టేక్ ను కంట్రోల్ చేసే సామర్ధ్యం తగ్గిపోతుంది. అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (Penn State College of Medicine) శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది.
సిగ్నలింగ్ రూట్ లో విఘాతం..
మెదడులోని న్యూరాన్ల పనితీరును నియంత్రించేందుకు పెద్ద నక్షత్రం ఆకారంలోని కణాలు ఉంటాయి. వాటిని ఆస్ట్రో సైట్స్ (Astrocites) అంటారు.ఇవి మెదడుకు, జీర్ణ వ్యవస్థలోని గట్ కు మధ్య ఉండే సిగ్నలింగ్ రూట్ ను (Signalling Route) కంట్రోల్ చేస్తాయి. హై ఫ్యాట్, హై క్యాలరీస్ ఉండే ఫుడ్ ను తినడం వల్ల ఈ సిగ్నలింగ్ రూట్ లో విఘాతం ఏర్పడుతుంది.దాదాపు 10 నుంచి 14 రోజుల పాటు వరుసగా అధిక కొవ్వు/క్యాలరీల ఆహారం తీసుకోవడం వల్ల ఆస్ట్రోసైట్‌లు ప్రతిస్పందించడంలో విఫలమవుతాయి. అధిక కొవ్వు/క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆస్ట్రోసైట్‌లు మొదట్లో ప్రతిస్పందిస్తాయి. వాటి క్రియాశీలత నాడీ కణాలను ఉత్తేజపరిచే గ్లియోట్రాన్స్‌మిటర్‌లు, రసాయనాల (గ్లుటామేట్ మరియు ATPతో సహా) విడుదలను ప్రేరేపిస్తుంది. జీర్ణ వ్యవస్థ ని నియంత్రించే న్యూరాన్‌లను ఉత్తేజపరిచేందుకు సాధారణ సిగ్నలింగ్ మార్గాలను ఎనేబుల్ చేస్తుంది. ఈక్రమంలో సిగ్నలింగ్ రసాయనాల తగ్గుదల చోటుచేసుకొని.. జీర్ణక్రియలో జాప్యానికి దారితీస్తుంది. దీనివల్ల కడుపు ఖాళీగా ఉంది అని ఫీలింగ్ కలిగి మితిమీరిన ఫుడ్ తింటారు. ఈవిధమైన ఓవర్ ఈటింగ్ వల్ల ఊబకాయం వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.ఈ వివరాలను ఎలుకలపై జరిపిన స్టడీలో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ” ది జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ”లో పబ్లిష్ అయింది.
హై ఫ్యాట్, హై క్యాలరీస్ ఫుడ్ వల్ల బరువు పెరగడం (Weight Gain) , ఊబకాయం (Obesity) వంటి సమస్యలు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఊబకాయం అనేది హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 మధుమేహానికి దారి తీయొచ్చని వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్‌లోని 63 శాతం మంది పెద్దలు ఆరోగ్యకరమైన స్థాయి కంటే ఎక్కువ బరువే ఉన్నారు . వీరిలో దాదాపు సగం మంది ఊబకాయంతో జీవిస్తున్నారు. ఇంగ్లండ్ లో ప్రాథమిక పాఠశాల పూర్తి చేసుకున్న ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధ పడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.