Anjeer: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన అంజీర్ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే అంజీర్ పండును ఇష్టపడితే మరి కొందరు అంజీర్ కాయను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లను తింటే బలహీనత, అలసట అనే సమస్యలే రావట. డ్రై అంజీర్ పండును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నానబెట్టిన అంజీర్ పండ్లు ఆడవారికి ఎంతో మేలు చేస్తాయట. ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తింటే హార్మోన్ల అసమతుల్యత ఉండదట.కాగా ఈ పండ్లలో ఉండే పోషకాలు పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా అంజీర పండ్లు ఉపయోగపడతాయట. ఎప్పటి నుంచో మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారికి ఈ నానబెట్టిన అంజీర్ చాలా మేలు చేస్తుందట. పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల పేగులు శుభ్రపడతాయట. అలాగే మలవిసర్జన కూడా సాఫీగా సాగుతుందట. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ పేగుకదలికలను మెరుగుపరిచి మలవిసర్జనకు సహాయపడుతుందని చెబుతున్నారు.
రాత్రి నానబెట్టిన అంజీర పండ్లను ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల ఉదయాన్నే మీ జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుందని, తిన్నది సైతం సులువుగా జీర్ణం అవుతుంది చెబుతున్నారు. అంజీర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతగానో సహాయ పడతాయని చెబుతున్నారు. అలాగే ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తింటే రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు జబ్బుల బారిన పడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బరువు తగ్గాలి అనుకుంటే అత్తి పండ్లను చేర్చుకోవాలని చెబుతున్నారు. అంజీర పండ్లులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అంజీర పండ్లలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయట. మీరు ఉదయాన్నే పరిగడుపున నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే రిస్క్ చాలా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Anjeer: ఏంటి.. ఉదయాన్నే నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

Anjeer