Site icon HashtagU Telugu

High Blood Pressure: బీపీని తగ్గించే నాలుగు రకాల జ్యూస్ లు.. అవేంటంటే?

High Blood Pressure

High Blood Pressure

ప్రస్తుత రోజుల్లో అధిక మంది అధిక రక్తపోటు లేదా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ అధిక రక్తపోటు కారణంగా ఉన్నటువంటి బీపీ అమాంతం పెరిగిపోవడం, లేదంటే అమాంతం తగ్గిపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రక్తపోటు సమస్యలు తరచుగా వస్తూ ఉంటే దాని ప్రభావం గుండెపై పడుతుంది. దీని కారణంగా గుండె పోటు, మధుమేహం, మూత్రపిండాలలో తీవ్ర సమస్యలు వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ఈ రక్త పోటు సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి అని చెప్పవచ్చు.

కాబట్టి అటువంటి వారు వారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే బీపీ సమస్యతో బాధపడే వారు నాలుగు రకాల జ్యూస్ లు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి గట్టేక్కవచ్చు. మరి ఆ నాలుగు రకాల జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి నీరు.. ఈ కొబ్బరి నీళ్లలో శరీరంకి కావాల్సిన ఎన్నో రకాల పోషక గుణాలు ఉన్నాయి. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నీళ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

అలాగే బీట్‌రూట్‌ రసం.. బీట్‌రూట్‌లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది. అలాగే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దానిమ్మ రసం.. దానిమ్మ లో విటమిన్లు, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. దానిమ్మ వల్ల ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ రసం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. టమోటా రసం.. టమోటాలో విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని పచ్చిగా తినడం లేదా రోజూ ఒక గ్లాసు జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.