High blood pressure: హై బీపీతో బాధపడేవారు రోజుకి ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?

శరీరానికి నీరు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. శరీరంలో సరిపడా నీరు లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు

Published By: HashtagU Telugu Desk
High Blood Pressure

High Blood Pressure

శరీరానికి నీరు ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. శరీరంలో సరిపడా నీరు లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనిషి అన్నం లేకపోయినా ఉండగలరు కానీ నీరు లేకపోతే ఉండలేరు. శరీరంలో సరిపడినంత నీరు లేకపోతే డిహైడ్రేషన్ టు గురై నీరసించి కళ్ళు తిరిగి పడిపోతారు. అయితే వైద్యులు ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తాగమని చెబుతూ ఉంటారు. శరీరానికి సరిపడినంత నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతూ ఉంటారు. కానీ అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు తగినంత నీరు మాత్రమే తాగాలి.

ఈ అధిక రక్తపోటు సమస్య వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందులో బాగంగానే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు నీళ్లు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అలాగే బాడీ హైడేట్రేడ్ గా ఉంటే గుండె సమర్థవంతంగా పనిచేస్తూ శరీరం మొత్తానికి రక్తాన్నిసరఫరా చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కానీ ఇప్పుడు మోతాదుకు మించి తీసుకోకుండా ఉండటం.

శారీరక శ్రమ చేయడం, ఆల్కహాల్ ను ఎక్కువగా సేవించకపోవడం, ధూమపానం అలవాటును మానుకోవడం వంటి వాటి ద్వారా హైబీపీ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటి తో పాటుగా పుష్కలంగా నీరు తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటు సమస్యను తగ్గించడం కోసం నీరును కొంత పరిమాణంలో తరచుగా తాగాలి. అలాగే ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది.

  Last Updated: 25 Oct 2022, 07:07 AM IST