Site icon HashtagU Telugu

High Blood Pressure: హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో మీకు తెలుసా?

High Blood Pressure

High Blood Pressure

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బీపీ సమస్య కూడా ఒకటి. చాలామంది హై బీపీ లో బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. మరి హైబీపీ సమస్యతో బాధపడే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. అలాగే హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీపీ ఎక్కువగా ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాల్లో చాట్ మసాల ఒకటి. ఇది మీరు తినే ఫుడ్ రుచిని పెంచినా దీనిలో సాల్ట్ ఎక్కువగా ఉంటుందట. ఈ ఉప్పులోని సోడియం మీ కిడ్నీలను నెగిటివ్​ గా ఇంపాక్ట్ చేస్తుందట. శరీరంలోని నీటిని నిలిచిపోయేలా చేసి బీపీని కూడా పెంచుతుందని,మూత్రపిండాలు, గుండె, మెదడుపై ప్రెజర్​ని పెంచుతుందని చెబుతున్నారు.

అలాగే చాలామంది ఇష్టంగా తినే వాటిలో పచ్చళ్ళు కూడా ఒకటి. కొంతమంది కూరలు ఉన్నా సరే పచ్చళ్ళని వేసుకొని తింటూ ఉంటారు. మీకు హైబీపీ సమస్య ఉంటే వెంటనే పచ్చళ్ళు తినడం ఆపేయాలని చెబుతున్నారు. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలని ఎక్కువ మొత్తంలో ఉప్పు వేస్తారు. దీనివల్ల ఎంతకాలమైన పచ్చడి తినడానికి రుచిగా ఉంటుంది. హై బీపీ ఉన్నవారు పచ్చడి ఎక్కువగా తింటే కిడ్నీలపై నెగిటివ్ ప్రభావం వస్తుందట. కాబట్టి వెంటనే పచ్చళ్ళు తినడం ఆపేయండి.

అలాగే హై బీపీ సమస్యతో బాధపడుతున్న వారు తినకూడని ఆహార పదార్థాలలో రెడ్ మీట్ కూడా ఒకటి. చాలామంది గొర్రె, ఆవు, పోర్క్, మటన్​ ను తింటారు. వాటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందట. తరచుగా తింటే గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఇది బీపీ పెరిగి హార్ట్ వాల్స్​ ని దెబ్బతీస్తుందట. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తీవ్రంగా పెరుగుతాయని చెబుతున్నారు.

అలాగే నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివట. కానీ కొందరు సాల్టెడ్ నట్స్​ని తింటారు. బాదం, హాజల్​నెట్​, వాల్​నట్​ వంటి వాటిని సాల్టెడ్​ గా కాకుండా నార్మల్​ గా తీసుకుంటే చాలా మంచిదని చెబుతున్నారు. వీటితో పాటుగా సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అలాగే ప్రాసెస్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు.