Wall squats: గోడకుర్చీ వేయడం వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా?

మామూలుగా మనం స్కూల్ డేస్ లో అల్లరి చేస్తే టీచర్స్ వాళ్ళు ఎక్కువగా మనకు గోడకుర్చీ వేయించేవాళ్ళు. ఈ విషయం ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఆ స

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 10:00 PM IST

మామూలుగా మనం స్కూల్ డేస్ లో అల్లరి చేస్తే టీచర్స్ వాళ్ళు ఎక్కువగా మనకు గోడకుర్చీ వేయించేవాళ్ళు. ఈ విషయం ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో టీచర్స్ ని తిట్టుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దయిన తర్వాత ఆ విషయాన్ని ఒక జ్ఞాపకంలా గుర్తుతెచ్చుకొని సంతోష పడుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గోడకుర్చీ అనేది ఒక శిక్ష మాత్రమే కాదు. ఆరోగ్యపరంగా అదొక వరం అని చెప్పవచ్చు. అంతే కాకుండా కండరాలకు మేలు చేసే వ్యాయామం కూడా అని చెప్పవచ్చు. అధిక రక్తపోటును తగ్గించే అద్భుత వర్కౌట్. ముఖ్యంగా బీపీని నియంత్రించే వ్యాయామాల్లో గోడకుర్చీ కూడా ఒకటని. బీపీని నియంత్రించడానికి ఎక్కువ మంది వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తారు.

వాటితో పాటు రోజుకు ఒక ఐదు నిమిషాలు గోడకుర్చీ వేసినా కూడా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. హైబీపీని త్వరగా తగ్గించుకోవాలంటే గోడకుర్చీ వేయడం, నేలపై ప్లాంక్స్ చేయడం వంటివి మెరుగ్గా పనిచేస్తాయి. గోడకుర్చీ వేసినప్పుడు గోడకు వీపును ఆనించి, నేలకు తొడలు సమాంతరంగా ఉండేలా కుర్చీలో కూర్చున్నట్లుగా ఉంటుంది. ఇది శరీరంపై ఒక భిన్నమైన ఒత్తిడిని కలిగిస్తుంది. రెండు నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఈ భంగిమలో కూర్చుంటే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత గోడకుర్చీ వేయడం ఆపేస్తే వెంటనే రక్తప్రసరణ మొదలవుతుంది. ఇది శరీరం అంతా రక్తం ప్రసరించేలా చేస్తుంది. అయితే ఈ గోడకుర్చీ వేసినప్పుడు కచ్చితంగా శ్వాస ఎక్కువగా తీసుకోవాలి.

ఐదు నిమిషాల పాటూ రోజూ గోడకుర్చీ వేయడం కష్టం కాబట్టి కనీసం రెండు నిమిషాలు గోడకుర్చీ వేయడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యం పై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన డైట్ ని కూడా తీసుకుంటే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఆల్కహాల్, ధూమపానం వంటివి పూర్తిగా మానేయాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పూర్తిగా అదుపులో ఉంటాయి. 40 ఏళ్లు దాటిన వారు తప్పకుండా ప్రతి నెలా రక్తపోటును చెక్ చేయించుకోవడం చాలా అవసరం. రోజూ గోడకుర్చీ వ్యాయామం చేయలేని వారు వారానికి మూడుసార్లు అయినా కనీసం రెండు నిమిషాలు పాటు ఈ గోడకుర్చీ వేస్తే ఎంతో మంచిది. హృదయ సంబంధం వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే రోజుకు అరగంట నుంచి గంట వరకు వాకింగ్ చేయడం కూడా ఎంతో ఆరోగ్య కరం.