Fenugreek Water: మన వంటింట్లో దొరికే మెంతుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కొన్ని వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కాగా మెంతులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మెంతులు తినడం మంచిదే కానీ అతిగా తింటే మాత్రం నష్టాలు తప్పవు అని చెబుతున్నారు. మెంతులు ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెంతులలో శక్తి, ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఇనుము, కేల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఇందులో లభిస్తాయి. కాగా మెంతుల నీరు ఆరోగ్యానికి మంచిదే కానీ దీని వల్ల కొన్ని రకాల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మెంతుల నీటిని రోజూ తాగడం వల్ల డయాబెటిస్, హైపోగ్లైసీమియా రోగులలో షుగర్ లెవల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుందట. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మదింప జేయడం ద్వారా మెంతులు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయట.
అయితే ఇప్పటికే రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నవారికి లేదా డయాబెటిస్ చికిత్స తీసుకుంటున్న వారికి ఇది గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక పతనానికి కారణమవుతుందట. ఇది తలతిరగడం, అలసట లేదా మూర్ఛకు దారితీయవచ్చట. రోజూ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలట. గర్భిణీ స్త్రీలు మెంతుల నీటిని వాడటంలో జాగ్రత్తగా ఉండాలని, మెంతులలో గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే సహజ సమ్మేళనాలు ఉంటాయి. అధికంగా తీసుకోవడం వల్ల గర్భాశయ ఉద్దీపన, అరుదైన సందర్భాల్లో నెలలు నిండకుండానే ప్రసవం లేదా గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. హైపోథైరాయిడిజం ఉన్నవారికి, థైరాయిడ్ మందులు వాడేవారికి మెంతులు సమస్యలను సృష్టించవచ్చుట్.ఎందుకంటే ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందని, మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. కాబట్టి మెంతులు తరచుగా తీసుకునే వారు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సలహా అవసరం అని చెబుతున్నారు.
Fenugreek Water: ప్రతీ రోజు మెంతుల నీరు తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Fenugreek Water