మందార పువ్వుల గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో రకాల మందారాలను మనం చూసే ఉంటాం. ఈ మందార పువ్వులను దేవుడికి పూజలో ఉపయోగిస్తూ ఉంటారు.. అలాగే చాలా ఎరకలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఈ మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పువ్వులను ఉపయోగించి రక రకరకాల న్యాచురల్ రెమెడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే మందార పువ్వులు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా మందార పువ్వుల టీ ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుందట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మందార పువ్వులతో తయారుచేసిన టీని మందార పూల టీ అంటారు. దీని రుచిలో కొంచెం పుల్లగా, తీపిగా ఉంటుంది. ఈ టీ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని చెబుతున్నారు. కాగా మందార పూల టీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందట. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదట. కాబట్టి దీన్ని తరచుగా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. అలాగే మందార పూల టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందట. మందార పూల టీ జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
అదేవిధంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందట. కాగా మందార పూల టీ చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదట. ఇది చర్మాన్ని కాంతివంతంగా, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. మందార పువ్వుల టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. మందార పూల టీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుందట. ఇది ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు.
అయితే ఇంతకీ మందార పూల టీ ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. తాజా మందార పువ్వులు లేదా ఎండిన మందార రేకులు,నీరు,తేనె లేదంటే చక్కెర నిమ్మరసం తీసుకోవాలి. మొదటగా మందార పువ్వులు లేదా రేకులను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో నీరు పోసి వేడి చేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత, మందార పువ్వులు లేదా రేకులను వేసి 5 నుంచి 10 నిమిషాలు మరిగించాలట. తర్వాత టీని వడకట్టి కప్పులో పోయాలట. రుచికి తగినంత తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. వేడి వేడిగా లేదా చల్లగా కూడా తాగవచ్చని చెబుతున్నారు.