Site icon HashtagU Telugu

Hot Or Iced Coffee: కోల్డ్ కాఫీ- హాట్ కాఫీ.. ఈ రెండింటిలో ఏదీ ఆరోగ్యానికి మంచిది..?

Hot Or Iced Coffee

Hot Or Iced Coffee

Hot Or Iced Coffee: రుచితో పాటు ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే తర్వాత సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల మీరు మీ ఆహారంలో రుచికరమైన, మీ ఆరోగ్యానికి హాని కలిగించని ప్రయోజనకరమైన వాటిని చేర్చుకోవడం చాలా ముఖ్యం. కాఫీ (Hot Or Iced Coffee) గురించి మాట్లాడినట్లయితే.. అధిక కెఫిన్ కారణంగా కొంతమందికి కాఫీ ఆరోగ్యకరమైన పానీయం కాకపోవ‌చ్చు.. కానీ కొన్నిసార్లు కాఫీ తాగడం కొందరికి మంచి ఎంపిక.

శరీరంలో బలహీనత ఉన్నా, రక్తపోటు తక్కువగా ఉన్నా కాఫీ తాగడం మంచిది. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు కాఫీని తీసుకుంటారు. కానీ చాలామంది వేడి కాఫీ లేదా చల్లని కాఫీ ఆరోగ్యానికి మంచిదా అనే దానిపై శ్రద్ధ చూపరు. మీరు కూడా కాఫీ ప్రియులైతే వేడి కాఫీ- కోల్డ్ కాఫీలో మీ ఆరోగ్యానికి ఏ కాఫీ ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

కెఫిన్ ఏందులో ఎక్కువ?

కాఫీ విషయానికి వస్తే.. మనం కెఫిన్‌ను ఎలా మరచిపోగలం? వేడి, చల్లని కాఫీ రెండింటిలోనూ కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ పని శరీరంలో జీవక్రియ రేటు, కొవ్వు ఆక్సీకరణను పెంచడం. వేడి కాఫీ కూడా థర్మోజెనిసిస్‌ను ప్రోత్సహిస్తుంది. పాలు లేని బ్లాక్ హాట్ కాఫీ శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వేడి కాఫీలాగే కోల్డ్ కాఫీ కూడా జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అయితే కోల్డ్ కాఫీకి పాలు, ఫ్లేవర్డ్ సిరప్ లేదా క్రీమ్, చక్కెర జోడించడం వల్ల జీవక్రియ తక్కువగా ఉండవచ్చు. కానీ అదనపు కేలరీలు, చక్కెర సహకారం ఎక్కువగా ఉండవచ్చు.

ఈ కాఫీ జీర్ణక్రియను ఎలా ప్రభావితం చేస్తుంది?

వేడి కాఫీ దాని వెచ్చదనం కారణంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే కోల్డ్ కాఫీ జీర్ణం కావడం కొంచెం కష్టం. కోల్డ్ కాఫీలో పాలు, చక్కెర, క్రీమ్, చాక్లెట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది.

Also Read: Rythu Runa Mafi: తెలంగాణ రైతుల రుణ మాఫీ.. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు!

బరువు తగ్గడానికి ఏ కాఫీ ఉపయోగపడుతుంది?

మీరు బరువు తగ్గడానికి కాఫీని తాగాల‌నుకుంటే మీరు దీని కోసం వేడి కాఫీని తీసుకోవ‌చ్చు. నీరు, గ్రౌండ్ కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కోల్డ్ కాఫీ వేగంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. అయితే అదనపు చక్కెర, క్రీమ్, పాలు కారణంగా కోల్డ్ కాఫీ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడదు.

ఏది ఎక్కువ పోషకమైనది?

వేడి- చల్లని కాఫీ మధ్య పోషక విలువలను పోల్చవచ్చు. మీరు వేడినీరు, గ్రౌండ్ కాఫీ గింజలను కలపడం ద్వారా తయారు చేస్తే వేడి కాఫీలో విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాఫీ అకస్మాత్తుగా శరీరానికి బలాన్ని ఇస్తుంది. మానసిక చురుకుదనానికి మంచి ఎంపికగా కూడా ఉంటుంది. కోల్డ్ కాఫీ గురించి చెప్పాలంటే.. ఇది వేడి కాఫీలో అదే పోషక లక్షణాలను కలిగి ఉంది. కోల్డ్ కాఫీ చేయడానికి కోల్డ్ బ్రూ లేదా ఐస్‌, చ‌ల్లటి నీటిని ఉపయోగిస్తారు. ఇందులో పాలు, చక్కెర, క్రీమ్ కలపడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.