డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే డ్రై ఫ్రూట్స్ మంచిదే కదా అని చాలామంది ఎక్కువ ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ అలా తినడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని చెబుతున్నారు. ఏదైనా సరే మితిమీరి తింటే సమస్యలు తప్పవని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బాదం, వాల్ నట్ లు, జీడిపప్పు, హాజెల్ నట్ లు,పిస్తాలు వంటి గింజలు వాటి ప్రయోజనకరమైన కొవ్వు, ప్రోటీన్ కంటెంట్ అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి వీటిలో కొన్ని నట్స్ తో సాధారణ లక్షణాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అలాంటి నట్స్ లో ఫైటేట్స్, టానిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. నట్స్ లో ఉండే కొవ్వు వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో డయేరియాకు దారి తీస్తుందని చెబుతున్నారు. మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నట్స్ ఒక గొప్ప స్నాక్ గా పనిచేస్తుందట. ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కారణంగా అతిగా తినకుండా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుందట.
ఈ రెండు కూడా బరువు తగ్గడానికి చాలా అవసరం అని చెబుతున్నారు… కానీ ఈ స్నాక్స్ అధికంగా తినడం వల్ల అధిక కేలరీల ప్రభావంతో బరువు పెరగడానికి దారితీస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎండుద్రాక్ష వంటి చక్కెర కంటెంట్, కేలరీలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల చక్కెర స్థాయిలు అసమతుల్యతకు దారితీసి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందట. అందువల్ల, డ్రై ఫ్రూట్స్‌ను ఎల్లప్పుడూ మితంగా తినడం చాలా మంచిది అని చెబుతున్నారు. అయితే ఏ ఆహారం అయినా సరే మితిమీరిన వినియోగం ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది కాబట్టి కొన్ని రకాల నట్స్‌ని మితంగా తీసుకోవాలి. ఈ గింజలలో బ్రెజిల్ గింజలు, జాజికాయలు, బాదంపప్పులు ఉన్నాయి. బ్రెజిల్ గింజలను నమలడం వల్ల సెలీనియం ఎక్కువగా ఉంటుంది. అయితే బాదంపప్పులో హైడ్రోసియానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యలు, ఊపిరాడకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.