Food Habits : వారంతా టెక్ ప్రపంచపు రారాజులు. వారు సృష్టించిన టెక్ ప్రపంచంలోనే మనుషులు నిత్యం బతుకుతున్నారు. ఇంతటి గొప్ప ఆవిష్కరణలకు ఆద్యులుగా నిలిచిన టెక్ బిలియనీర్ల క్రేజీ ఫుడ్ హ్యాబిట్స్ (Food Habits) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇతరులకు భిన్నంగా వారు రోజూ ఏమేం తింటారో గ్రహిద్దాం..
ఎలోన్ మస్క్:
డోనట్స్ , బార్బెక్యూ అంటే ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్‌కు చాలా ఇష్టం. జీవితం చాలా చిన్నదని.. రుచికరమైన ఆహారాన్ని తినడానికి వెనుకాడకూడదని ఆయన అంటారు. మస్క్ ఫ్రెంచ్ ఫుడ్ ఐటమ్స్ ను కూడా ఇష్టపడతాడు. ఆయన బాగా ఇష్టపడే ఆల్కహాల్ విస్కీ. రోజూ ఉదయం 7 గంటలకు మస్క్ వేడివేడి కాఫీ తాగుతాడు. వారంలో చాలారోజులు ఉదయం వేళ మస్క్ టిఫిన్ చేయడు. టిఫిన్ టైంలో ఆమ్లెట్ తినడానికి ఆయన ఇష్టపడతారు.
జెఫ్ బెజోస్:
అమెజాన్ వ్యవస్థాపకుడు మరియు బిలియనీర్ జెఫ్ బెజోస్ ఆహారపు అలవాట్ల గురించి చాలామందికి తెలియదు. అతను టిఫిన్ లో పిల్స్‌బరీ బిస్కెట్లను తినడానికి ఇష్టపడతాడు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఆయన తినరు. ఆరోగ్యకరమైన, సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. తన కండరాలను నిర్వహించడానికి బెజోస్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు.
అమెజాన్ కంపెనీకి చెందిన ఒక సమావేశంలో బెజోస్.. బంగాళాదుంపలు, బేకన్, పచ్చి వెల్లుల్లి పెరుగు, పచ్చి గుడ్డుతో పాటు మధ్యధరా ఆక్టోపస్ యొక్క అల్పాహారాన్ని తిన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఊసరవెల్లి జాతికి చెందిన ఇగ్వానాల ఫ్రై ను ఆయన తిన్నారు. బొద్దింకల కర్రీ అంటే కూడా బెజోస్ లైక్.
బిల్ గేట్స్ :
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చక్కెర పానీయాలు బాగా తాగుతారు. ఆయన ప్రతిరోజూ దాదాపు నాలుగు డబ్బాల డైట్ కోక్ తీసుకుంటారు. నారింజ-రుచి గల చక్కెర పానీయం టాంగ్‌కి కూడా అభిమాని. గేట్స్ రోజూ టిఫిన్ లో కోకో పఫ్స్ తింటారు. చీజ్‌బర్గర్‌లు అంటే ఆయనకు ఇష్టం .
మార్క్ జుకర్బర్గ్:
మార్క్ జుకర్‌బర్గ్ మేకలు, పందులు, కోళ్లు, ఎండ్రకాయల మాంసం తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్న వంటకం ఉగాలి, తిలాపియ అనే చేపల కూర అంటే ఆయనకు లైక్. ఫ్రైడ్ చికెన్ కర్రీని తినడం అంటే జుకర్ బర్గ్ కు మహా ఇష్టం.
సామ్ ఆల్ట్‌మాన్:
OpenAI యొక్క CEO సామ్ ఆల్ట్‌మాన్ ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు. చిన్నతనం నుంచే ఆయనకు శాఖాహారం అంటే ఇష్టం. మిథైల్ B12, ఒమేగా-3, ఐరన్ , విటమిన్ D3 వంటి సప్లిమెంట్లతో కూడిన ఆహార పదార్థాలను సామ్ ఆల్ట్‌మాన్ తీసుకుంటారు.ఆయన చాలా ప్రొటీన్ షేక్‌లను కూడా తీసుకుంటాడు. ఆయన ప్రతినెలా చాలా రోజులు అల్పాహారం తినడు. ఆయా రోజుల్లో అతను 15 గంటల ఉపవాసాన్ని పాటిస్తాడు. షుగర్ ఉండే ఆహార పదార్థాలకు, జంక్ ఫుడ్, జీర్ణక్రియను తీవ్రతరం చేసే స్పైసీ ఫుడ్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉంటాడు.
Also Read: Amrit Kalash Deposit Scheme: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ పునరుద్ధరించిన ఎస్బీఐ.. జూన్ 30 వరకు ఛాన్స్