Vitamin D: ఈ తొమ్మిది రకాల ఆహార పదార్థాలలో విటమిన్ డి అధికంగా ఉంటుందని మీకు తెలుసా?

శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరం. అలాంటి వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి

Published By: HashtagU Telugu Desk
Vitamin D Food

Vitamin D Food

శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరం. అలాంటి వాటిలో విటమిన్ డి కూడా ఒకటి. శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక విటమిన్ డి ని పెంచుకోవడం కోసం చాలామంది రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇకమీదట ఆ అవసరం లేదు. మీ ఇంట్లోనే దొరికే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఉపయోగించి విటమిన్ డీ సమస్యను తొలగించుకోవచ్చు. మరి విటమిన్ డి కలిగిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సమరుజాతి చేపల ద్వారా లభిస్తుంది. అంటే ఆయిల్ నూనెల ద్వారా ఇది లభ్యమవుతుంది. అదే నీడలో పెరిగిన పుట్ట గొడుగుల్లో పెద్దగా విటమిన్ ఉండదు. సాల్మన్ చేపలలో కూడా విటమిన్ డి బాగానే లభిస్తుంది. అదే విధంగా సోయా పాలల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. అలానే ఆరంజ్ లో కొద్దిగా విటమిన్ డీ లభిస్తుంది. పెరుగు ద్వారా కూడా కొద్ది మొత్తంలో విటమిన్ లభిస్తుంది. గుడ్డులో కూడా విటమిన్ లభిస్తుంది. విటమిన్ డి లోపిస్తే ఆకలి లేకపోవడం, బరువు తగ్గటం, నిద్రలేమి, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. విటమిన్ డి మరింత లోపేస్తే రకరకాల ఎముకల సమస్యలు వెంటాడతాయి రకరకాల రోగాలు వస్తాయి.

కాబట్టి విటమిన్ డి లోపించినప్పుడు పైన చెప్పిన ఆహారాలు తీసుకోవడం మంచిది. ఉదయం వేల కాసేపు సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో కూర్చోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. అలాగే చాలామంది శరీరంలో విటమిన్ డి తగ్గినప్పుడు మార్కెట్లో దొరికే ఇంగ్లీష్ మెడిసిన్స్ ని ఉపయోగించి విటమిన్ డి ని పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లోనే దొరికే ఈ సింపుల్ ఆహార పదార్థాలను తిని విటమిన్ డి ని పెంచుకోవచ్చు. సూర్య రశ్మి ద్వారా కూడా విటమిన్ డి పెంచుకోవచ్చు.

  Last Updated: 23 Feb 2024, 09:09 PM IST