workouts: చలికాలం వర్కవుట్స్ చేయడం కలిగే ప్రయోజనాలివే

  • Written By:
  • Updated On - December 19, 2023 / 05:31 PM IST

workouts: చలికాలంలో వర్కవుట్స్‌ చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే నడక, రన్నింగ్‌ చేయటం వల్ల ఉపశమనం పొందుతారు. రక్తప్రసరణ సాఫీగా జరగటమే కాకుండా నిద్రమత్తు వదులుతుంది. జాగింగ్‌ తర్వాత శరీరాన్ని స్ట్రెచ్ చేయటం చేయాలి. ఎలాంటి గాయాలపాలు కాకుండా జాగ్రత్తగా స్ర్టెచ్‌ చేసుకోవాలి. ఇక సూర్యనమస్కారాలు చేయటం కూడా మంచిది. దీని వల్ల విటమిన్‌-డి శరీరానికి అందుతుంది.

ఒత్తిడి ఉండే మాత్రం కచ్చితంగా మెడిటేషన్‌ చేయటం మంచిది. దీని వల్ల మెంటల్లీ బ్యాలెన్స్‌ అవుతారు. ప్రశాంతత వస్తుంది. చలికాలంలో దగ్గులు, ఇతర సీజనల్‌ సమస్యలు ఎదురవుతాయి. అందుకే సూప్స్‌, గ్రీన్‌టీ లాంటివి వేడివేడిగా తీసుకోవాలి. ఏదైనా సరే తాజా ఆహారం తినటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. యోగాకి అధిక సమయం కేటాయించడం, సోషల్‌ మూవింగ్‌ ఉండటం వల్ల ఉపశమనం పొందుతారు.

Also Read: Medaram Jatara: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించేనా!