Site icon HashtagU Telugu

Eye Health Tips: కంటిచూపు మెరుగుపరచుకోవాలంటే.. ఈ ఐదు చిట్కాలు పాటించాల్సిందే?

Eye Health Tips

Eye Health Tips

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్ డిజిటల్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో చిన్నవయసులోనే కంటిచూపు సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లలే కళ్లద్దాలను ఉపయోగిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. వాటితో పాటుగా మనం తినే ఆహారపు అలవాట్లని మార్చుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. మరి అందుకోసం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. కంటి చూపును మెరుగుపరుచుకోవడం కోసం ముఖ్యంగా ఐదు రకాల చిట్కాలను పాటించాలి అంటున్నారు నిపుణులు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి ముఖ్యంగా విటమిన్ ఏ, సీ, ఈ వంటివి కంటిచూపు సమస్యలను దూరం చేస్తాయి. మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి.. ఇందుకోసం పండ్లు ఫిష్ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. మనం తరచూ తీసుకోవాల్సిన వాటిలో ఆకుకూరలు కూడా తప్పనిసరి. ఆకుకూరలు కంటి చూపుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కూరగాయలు, ఆకు కూరలు అనేవి న్యూట్రియెంట్స్‌ తో నిండిపోతాయి. కంటిచూపును యూవీ కిరణాలు, రేడియేషన్ నుండి కాపాడడానికి ఉపయోగపడతాయి.

ఏ సీజన్ లో అయినా కూడా ఆ శరీరానికి సరిపడా నీరు తాగడం తప్పనిసరి. ఎండలో పనిచేసే వారు కాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా నీటిని తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా తాగడం కంటిచూపుకు కూడా చాలా అవసరం. ఎందుకంటే డీ హైడ్రేషన్ కారణంగా కంటిచూపు సమస్యలు కూడా వస్తాయి. అలాగే వయసుకు తగ్గట్టు బరువు లేకపోయినా సమస్య. అలాగని వయసుకు తగ్గ బరువుతో పాటు అధిక బరువు ఒబిసిటీ ఉన్నవారు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక బరువు వల్ల కళ్ల మీద కూడా ప్రెజర్ పడుతుంది. పురుషులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ధూమపానం మానేయడం. ధూమపానం కారణంగా కంటిచూపు సమస్య కూడా వస్తుంది. దాని వల్ల సైట్ సమస్యలు కూడా వస్తాయి. కొన్ని కంటిచూపు సమస్యలు స్మోక్ చేసేవారిలో ఎక్కువగా ఉంటాయని, అందుకే కళ్ల ఆరోగ్యం కోసం ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది.

Exit mobile version