Honey : తేనెను అతిగా తింటున్నారా…? మీరు డేంజర్ జోన్లో పడ్డట్లే…!

తేనె...ఇందులో ఎన్నో సహాజసిద్దమైన పోషకాలు ఉంటాయి.

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 12:44 PM IST

Health tips:తేనె…ఇందులో ఎన్నో సహాజసిద్దమైన పోషకాలు ఉంటాయి. చక్కెర కంటే తేనెనే నయమని అందరికీ తెలిసు. చాలా మంది చక్కెరకు బదులుగా తినేను తింటారు. అయితే తేనెను ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో తెలుకుందాం.

అందానికి, కేశాల నిగారింపునకు, శరీర ఆరోగ్యానికి, స్కిన్ సంరక్షణకు తేనె చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. అందుకే చాలా మంది తేనెను ఎక్కువగా వాడుతుంటారు. ఈ ప్రాసెస్ లో అవసరానికి మంచి తేనెను ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే దీని వల్ల ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రక్తంలో చక్కెర స్ధాయి: తేనె ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. కానీ తేనెను మోతాదుకు మించి తీసుకుంటే…మన శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున తేనెను పరిమితంగానే తీసుకోవడం ఉత్తమం.

జీర్ణక్రియ: తేనెను మోతాదుకు మంచి తీసుకుంటే…జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో కడుపునొప్పి, డయేరియా వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకే తేను పరిమితంగానే వాడాలని నిపుణులు చెబుతున్నారు.బరువు పెరగిపోవడం: ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నీళ్లలీ టీస్పూన్ తేనె వేసుకుని తాగుతే…బరువు తగ్గుతారని అందరికీ తెలిసిన విషయమే. కానీ అది పూర్తిగా నిజం కాదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే చక్కెర కంటే తేనె తక్కువ తీపిని కలిగి ఉన్నా…తేనె కూడా బరువును పెంచడం ఖాయమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

దంతాలు: తేనెను మోతాదుకు మించి వాడినట్లయితే నోటిలో చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుందట. దాంతో బ్యాక్టీరియా దంతాలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో నోటి నుంచి చెడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
రక్తపోటు: పీబీ సమస్యతో బాధపడేవారు తేనెకు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తేనెతో రక్తపోటు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయ పడుతున్నారు.