కీళ్ల సంబంధింత వ్యాధులు కాళ్లలో వాపును, నొప్పును కలిగిస్తాయి. దీంతో నడవటానికి చాలా కష్టంగా ఉంటుంది. కండరాలు పట్టేయడం, గాయాలు, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి.బాధించే కీళ్ల నొప్పులకు నివారణకు కూడా సహజమైన, ఆయుర్వేద విధానాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పసుపు
పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. కర్క్యూమిన్ వల్ల పసుపుకు యాంటీ ఇన్ ఫ్లమెటరి గుణం వస్తుంది. ఫలితంగా మోకాళ్ళ నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
* అల్లం
అల్లానికి కూడా యాంటీ ఇన్ ఫ్లమెటరి గుణం ఉంది. దీనికి అదనంగా యాంటీ యాక్సిడెంట్ గుణమూ దీని సొంతం. ఫలితంగా వంటల్లో, వివిధ రూపాల్లో అల్లం వాడకం ఆరోగ్యానికి ప్రయోజనకరమే. మోకాళ్ళ నొప్పులకూ ఇది చెక్ పెట్టగలదు.
* నీలగిరి నూనె
నీలగిరి లేదా యూకలిప్టస్ చెట్టు నుంచి తయారు చేసిన నూనె కీళ్ల నొప్పులు, ఇతర కండరాల నొప్పులకు అద్భుత ఆయుర్వేద ఔషధంగా ఉపయోగపడుతుంది. నీలగిరి నూనె రాయడం ద్వారా మంట, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* దాల్చిని
దాల్చిని చెక్క మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమెటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్ గా బహు రూపాల్లో పని చేస్తుంది. పెరుగు, పన్నీరు వంటి వాటిలో కలిపి దీన్ని వాడొచ్చు.
* కలబంద
కలబందలోనూ యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. ఫలితంగా ఇది మోకాళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆస్తమా, డయాబెటిస్ చికిత్స కోసం కూడా దోహదపడుతుంది. ఇందులో ఏ, సీ, ఈ, బీ12 విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.
* దశమూల
దశమూల అనేది పది మొక్కల మూలాలతో తయారు చేసేటువంటి సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం. ఇది నొప్పి నివారణగా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
* నిర్గుండి
ఆర్థరైటిస్ సహా ఇతర అనేక రకాల కీళ్ల నొప్పుల నివారణకు అత్యంత ప్రసిద్ధమైన మూలికలలో నిర్గుండి ఒకటి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మంట, నొప్పిని తగ్గించడమే కాకుండా కీళ్లను వదులుగా చేసేందుకు అవకాశం ఇస్తాయి.
* షల్లకి
షల్లకి అనేది సహజంగా నొప్పిని హరించివేసే ఆయుర్వేద మూలిక. ఇది బాధ నుంచి విముక్తి కలిగించి, కీళ్లలో కదలికను మెరుగు పరుస్తుంది. అలాగే కీళ్లలో పటుత్వాన్ని బలపరుస్తుంది.