Hemoglobin: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో మనుషులు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది రక్తహీనత

Published By: HashtagU Telugu Desk
Hemoglobin Increase

Hemoglobin Increase

ప్రస్తుత రోజుల్లో మనుషులు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా రక్తం స్థాయిని సరిగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అందువల్లే డాక్టర్లు పదే పదే రక్తం గురించి చెబుతూ ఉంటారు. హిమోగ్లోబిన్ శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే శరీరానికీ కావలసినంత ఐరన్ తీసుకోకపోతే, అది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే రక్తహీనత సమస్య ఏర్పడకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తహీనత లక్షణాలు బద్ధకం, మైకము, తలనొప్పి మొదలైనవి. ఆహారంలో ఐరన్ అధికంగా ఉండే వాటిని తీసుకోవడం మంచిదని వైధ్యులు సూచిస్తున్నారు. మీరు ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఆకుకూరలను ఆహారంలో చేర్చడంతో పాటు బ్రోకలీ, బచ్చలికూర, క్యాబేజీ, టర్పెంటైన్ గ్రీన్స్, కాలర్డ్స్, ఆస్పరాగస్, పుట్టగొడుగులు, బంగాళాదుంలను కూడా ఆడ్ చేసుకోవాలి. అలాగె ఐరన్ లోపంతో బాధపడుతుంటే, మీ ఆహారంలో నేరేడు పండు, బెర్రీలు, పుచ్చకాయలు, దానిమ్మ, ఎండుద్రాక్ష , బ్లాక్ బెర్రీస్ పండ్లను చేర్చడం వల్ల అవి శరీరానికి కావాల్సినంత ఐరన్ ను అందిస్థాయి. విటమిన్ సి తీసుకోవడం ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ సి ను సరైన మోతాదులో తీసుకోవడం ఎంతో ముఖ్యం.

అలాగే రోజూ ఒక ఆపిల్ లేదా దానిమ్మపండు తినాలి. హిమోగ్లోబిన్‌ను సరైన స్థాయికి తీసుకురావడానికి ఐరన్ అధికంగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే శరీరంలో ఫోలిక్ ఆమ్లం లోపం ఉన్నప్పుడు, హిమోగ్లోబిన్ స్థాయి శరీరంలో తగ్గడం మొదలవుతుంది. అందువల్ల హిమోగ్లోబిన్ స్థాయి సరిగ్గా ఉండాలని మీరు కోరుకుంటే, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. శరీరంలో హిమోగ్లోబిన్ వేగవంతంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. సీఫుడ్ లోనూ హీమోగ్లోబిన్ స్థాయిని పెంచే గుణాలుంటాయి. వీటిలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి. రక్తం స్థాయిని పెంచేందుకు అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి. అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి.

  Last Updated: 20 Jul 2022, 12:43 PM IST