Site icon HashtagU Telugu

Helth Tips: సెగ గడ్డల నొప్పి భరించలేకపోతున్నారా.. అయితే తక్షణ ఉపశమనం పొందండిలా?

Mixcollage 10 Jan 2024 08 43 Pm 7651

Mixcollage 10 Jan 2024 08 43 Pm 7651

సాధారణంగా చాలామంది సెగ గడ్డల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సెగ గడ్డలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మాములుగా శ‌రీరంలో అధిక వేడి, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, ఇన్ఫెక్షన్లు ఇలా అనేక ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై సెగ గ‌డ్డ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. చిన్న‌స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇవి దురద చీముతో కూడుకుని బాగా ఇబ్బంది పెడ‌తాయి. ఈ సెగ గడ్డలు, షేవ్ చేయడం వలన కలిగే గాయాలు, ఇన్ఫెక్షన్ల వంటి ఇతర కారణాల వలన కూడా ఇవి రావ‌చ్చు. ఇలా చాలా మందిని సెగ‌గ‌డ్డ‌లు తెగ బాధ పెడుతూ ఉంటాయి.

అయితే ర‌క‌ర‌కాల మందులు వాడుంటారు. కానీ కొన్ని సార్లు ఫ‌లితం ఉండ‌క‌పోవ‌చ్చు. అటువంటప్పుడు కొన్ని హోమ్ రెమిడీస్ ని ఫాలో అయితే చాలు వెంటనే ఉపశమనం పొందవచ్చు. మరి అందుకోస ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకు వెల్లుల్లి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలోని రోగ‌ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్క‌లంగా ఉంటాయి. శరీరంలోని పేరుకునే చెడు కొవ్వు మోతాదును తగ్గించడానికి వెల్లుల్లి తోడ్పడుతుంది. చర్మంపై ఎటువంటి వాపునైనా తొలగించడంలో సహాయపడుతాయి. వెల్లుల్లి లో యాంటి ఫంగల్, యాంటి క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.

వెల్లుల్లి తినడం వ‌ల్ల‌ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందిని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి రెబ్బ‌లు, ఒక స్పూన్ వాము క‌లిపి మిక్స్ చేసి పెస్ట్ లా త‌యారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను సెగ గ‌డ్డ‌ల‌పై పూయాలి. కొంత‌సేప‌టి త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క‌డ‌గాలి. రెగ్యూల‌ర్ గా ఇలా చేయ‌డం వ‌ల్ల సెగ గ‌డ్డ‌లు పూర్తిగా త‌గ్గిపోతాయి. అలాగే బియ్యం పిండితోనూ సెగ గ‌డ్డ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. బియ్య‌పు పిండిలో కొద్దిగా వాట‌ర్ వేసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని కొద్దిగా వేడిచేసుకోవాలి. గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత సెగ గ‌డ్డ‌ల‌పై రాయాలి. త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల సెగ గ‌డ్డ‌లు తొంద‌ర‌గా త‌గ్గిపోతాయి.

Exit mobile version