Site icon HashtagU Telugu

Paracetamol : పారాసెటమాల్ టాబ్లెట్స్ తో గుండె సమస్యలు …

Heart Problems With Paracet

Heart Problems With Paracet

పారాసెటమాల్ (Paracetamol ) అందరికి సుపరిచితమే..చిన్న పిల్లల దగ్గరి నుండి ముసలివారి వరకు ప్రతి రోజు ఈ పేరును తలుచుకుంటుంటారు. అంతలా ఈ టాబ్లెట్ ఫేమస్. ఒంట్లో ఏమాత్రం నలతగా అనిపించినా వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్ మింగేస్తుంటారు. ఒంట్లో చిన్న నొప్పి దగ్గరి నుండి 102 జ్వరం వరకు ఏదైనా సరే ఈ టాబ్లెట్ పనిచేస్తుండడం..మార్కెట్ లో దీని రేటు కూడా తక్కువగా ఉండడం తో ప్రతి ఒక్కరి ఇంట్లో పారాసెటమాల్ టాబ్లెట్స్ అనేవి కామన్ అయిపోయాయి. కానీ ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల గుండె సమస్యలు (Heart Problems) వస్తాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ పారసెటమాల్ టాబ్లెట్స్ ​పై అధ్యయనం చేశారట. ఈ అధ్యయనం లో ఈ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె లోపల అనేక సిగ్నలింగ్​ మార్గాలను మార్చడానికి కారణమవుతుందని అధ్యయనంలో కనుగొన్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై ఈ పారాసెటమాల్​ను ప్రయోగించగా.. వాటి గుండె కణజాలంలో ప్రోటీన్లు మారినట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనిలో పారాసెటమాల్​ ఇచ్చిన ఎలుకలపై ఏడు రోజులు ట్రయల్ చేసిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. గుండెలో పారాసెటమాల్ రెండు లేదా మూడు మార్గాలపై ప్రభావం చూపుతున్నట్లు తేలింది. అందుకే ఈ టాబ్లెట్స్ ను ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

500mg టాబ్లెట్స్​ను పెద్దలు 24 గంటల్లో నాలుగు సార్లు తీసుకోవచ్చని.. మోతాదుల మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలని , రోజులో 8 కంటే ఎక్కువ టాబ్లెట్స్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కేవలం టాబ్లెట్స్ మాత్రమే కాదు సిరప్ లు కూడా ఎక్కువగా తీసుకోవద్దట. అవి కూడా గుండె కు హాని చేస్తాయని అంటున్నారు. సో ఇక నుండి తక్కువ ధర..వెంటనే పని చేస్తుందని చెప్పి రోజుకు ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోకండి. ఇప్పటికే చాలామంది గుండెనొప్పి తో కన్నుమూస్తున్నారు. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు చూస్తుండగానే కుప్పకూలి చనిపోతున్నారు. ఇక ఈ టాబ్లెట్స్ వేసుకొని మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.

Read Also : Beerapottu Pachikaram : బీరపొట్టు – పచ్చికారం.. ఇలా ట్రై చేస్తే చాలా కమ్మగా ఉంటుంది